CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బుచ్చన్నగూడెం గ్రామ గిరిజన యువకులు అధ్వర్యంలో నిర్వహిస్తున్న వాలీబాల్,ముగ్గులు పోటీలను ప్రారంభించిన కోరం కనకయ్య

Share it:

  


మన్యంటీవీ,అన్నపురెడ్డిపల్లి: అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని ఆదివాసీ గిరిజన గూడెంమైన బుచ్చన్నగూడెం గ్రామంలో  గిరిజన యువకులు అధ్వర్యంలో,రాబోతున్న నూతన సంవత్సర సందర్భంగా గిరిజన యువకులకు వాలీబాల్,గిరిజన యువతి,మహిళలకు ముగ్గుల పోటీలను నేటి నుంచి నిర్వహిస్తున్నారు.ఈ క్రీడా పోటీలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య ముఖ్య విశిష్ట అతిథిగా విచ్చేసి,క్రీడలను ప్రారంభించారు.కోరం కనకయ్యను గ్రామ యువకులు మరియు వాడే రాంబాబు శాలువాతో సత్కరించి,ఫ్లవర్ బొకే ను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు ఆడటం వలన,క్రీడాకారులు చాలా మానసిక ఉల్లాసంగా ఉంటారని,ఆరోగ్యంగా ఉండటమే కాకుండా జ్ఞాపక శక్తి  మెరుగుపడుతుందని వ్యాఖ్యానించారు.వాలీబాల్ క్రీడకు టిఆర్ఎస్ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ,గతంలో పనిచేసిన వ్యాయామ ఉపాధ్యాయ(పిఈటి) బాధ్యతలను నిర్వర్తించి,జడ్జిమెంట్ ఇవ్వడం విశేషం.మూడు రోజుల పాటు జరగనున్నా,ఈ క్రీడా పోటీలకు అశ్వారావుపేట నియోజకవర్గం లోని పలు గ్రామాల గిరిజన యువకులు పాల్గొంటున్నారు.వాలీబాల్ క్రీడలో బహూకరించనున్న,ఆరు బహుమతులలో మొదటి బహుమతి 10,016/-రూపాయలను,రాష్ట్ర సేవా సంఘం అధ్యక్షులు మరియు అన్నపురెడ్డిపల్లి శివాలయ వ్యవస్థాపకులు మారగాని శ్రీనివాసరావు బహుకరించనున్నారు.రెండవ బహుమతి 8,016/-రూపాయలను తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి దారబోయిన రమేష్,పెంట్లం గ్రామాపంచాయతీ ఉప సర్పంచ్ తాటి రామచంద్ర రావు,ఆదివాసి జేఏసి మండల అధ్యక్షులు మడివి నాగేంద్రబాబు,మూడవ బహుమతి 6016/-రూపాయలను మడకం రమేష్(ఏఎస్ఐ),పోతప్ప(కానిస్టేబుల్),నాలుగవ బహుమతి 4016/-రూపాయలను టిఆర్ఎస్ పార్టీ అన్నపురెడ్డిపల్లి గ్రామ అధ్యక్షులు పానుగంటి రాఘవులు,తొట్టిపంపు సర్పంచ్ సున్నం చిరంజీవి,ఐదవ బహుమతి 3016/-రూపాయలను టిఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు వీరబోయిన వెంకటేశ్వర్లు,అరవ బహుమతి 2016/-రూపాయలను మర్రిగూడెం గ్రామ పంచాయతీ సెక్రెటరీ బాలోజీ ఇవ్వనున్నారు.ఈ క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కోరం కనకయ్య వెంట టిఆర్ఎస్ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ నాయకులు ఆదినారాయణ,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బోయినపల్లి సుధాకర్ రావు,టిఆర్ఎస్ యువజన నాయకులు వేముల హరీష్, ఏటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అగ్గి రవి,తోట్టిపంపు సర్పంచ్ సున్నం చిరంజీవి,సీతాయిగూడెం సర్పంచ్ కారం సుధీర్, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు నేరెళ్ల లాలయ్య,టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు కొత్తూరు వెంకటేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు వీరబోయిన వెంకటేశ్వర్లు తదితర నాయకులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: