CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బీసీలు ఆత్మగౌరవంతో జీవించాలి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణవరపు శ్రీనివాస్...

Share it:



మన్యం టీవీ : జూలూరుపాడు, సోమవారం నాడు వైరా నియోజకవర్గo లోని జూలూరుపాడు మండల కేంద్రంగా బీసీ కుల సంఘాల నాయకులతో సమావేశాన్ని  బండ్ల వెంకట్ అధ్యక్షతన నిర్వహించారు.  ఈ సమావేశానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా  వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణవరపు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ సమావేశాన్ని   ఉద్దేశించి ప్రసంగించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ  రాష్ట్రంలో 56 శాతం ఉన్నటువంటి బీసీలు ఆత్మగౌరవంతో  జీవించాలని ఆయన అన్నారు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని కులాలకు అన్ని సామాజిక వర్గాలకు ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన రాజకీయ అవకాశాలు కల్పించాలని  కానీ మన దేశంలో 56 శాతం ఉన్న బీసీలకు మాత్రం రాజకీయ రిజర్వేషన్లు కల్పించకుండా రాజకీయ అవకాశాలు ఇవ్వకుండా బీసీలను వెనక్కు నెట్టే  ప్రయత్నం చేస్తాన్నారు   అని శ్రీనివాస్ అన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే 20 జిల్లాల్లో ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా లేకపోవడమే దీనికి నిదర్శనమని అదేవిధంగా 129 బిసి కులాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంటే 115 కులాలు ఇప్పటివరకు అసెంబ్లీ లోకి అడుగుపెట్టక పోవడంమే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు. అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులకు  విజ్ఞప్తి  చేస్తున్నాం అని ఈరోజు అగ్రవర్ణాల రాజకీయ పార్టీల జెండాలు మోసిన అంత మాత్రానో, అగ్రవర్ణాల రాజకీయనాయకులకి జిందాబాద్ కొట్టినంత మాత్రానో, అగ్రవర్ణాల నాయకుల అడుగులకి మడుగులు  ఎత్తినంత మాత్రానో, మనకు ఆత్మ గౌరవం కాదని  ఎప్పుడైతే పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు పొందుతామో అప్పుడే మనం ఆత్మగౌరవం తో జీవిస్తాం అని ఆయన అన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలుచేసే దాని కోసం జరిగే పోరాటం లో పార్టీలకు అతీతంగా కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రజక సంఘo రాష్ట్ర ప్రధానకార్యదర్శి తెలగారపు అప్పారావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘము జిల్లా కార్యదర్శి కొక్కొండ రాంబాబు, షేక్ మహమ్మద్ రసూల్ , చెక్కిలాల సందీప్, నిమ్మటురి లచ్చయ్య, కొండా.సాయి, షేక్.ఆరిఫ్, పుల్లా చారి , సాయి  మరియు వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: