CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వైభవోపేతంగా సంతాన వేణుగోపాలస్వామి ఆలయ శంకుస్థాపన మహోత్సవం..

Share it:

 


శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్..

భక్తుల రాకతో భక్తజన సంద్రంగా మారిన పాలగుట్ట..



మన్యం టీవీ : జూలూరుపాడు భక్తులు కోరిన కోరికలు తీర్చే అతి పురాతన మహిమాన్విత శక్తులతో ప్రసిద్ధి చెందిన శ్రీ రుక్మిణీ సమేత సంతాన వేణుగోపాల స్వామి దేవాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమాన్ని సోమవారం అత్యంత భక్తి శ్రద్ధల నడుమ వేదపండితుల మంత్రోచ్ఛారణల తో వైభవోపేతంగా నిర్వహించారు.శంకుస్థాపన కార్యక్రమానికి వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ పాల్గొని భూమిపూజ చేసి పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. శ్రీకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కి పూర్ణకుంభం తో ఘన స్వాగతం పలికారు. శంకుస్థాపన మహోత్సవం సందర్భంగా దంపతుల పూజలు, హోమాలు నిర్వహిం చారు. ప్రభుత్వం అతి పురాతన దేవాలయం కావడంతో ఎండోమెంట్ పరిధిలోకి తీసుకొని ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది దీంతో పాటు గ్రామస్తులు, భక్తుల భూరి విరాళాలతో ఆలయ పనులను అత్యంత భక్తి శ్రద్ధల నడుము ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు వేలాదిగా తరలి వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.వచ్చిన భక్తులకు కొత్తగూడెం కు చెందిన బిల్డర్ దమ్మలపాటి శ్రీనివాసరావు- సత్యవతి దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డి సి సి బి చైర్మన్ కూరాకుల నాగభూషణం, సహకార సంఘం అధ్యక్షులు లేళ్ల వెంకటరెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ, జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు పరమేష్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగా సీతారాములు, ఎంపీపీ లావుడియా సోనీ జడ్పిటిసి భూక్యా కళావతి, కాకర్ల ఎంపీటీసీ పొన్నెకంటి సతీష్, శ్రీ క్రిష్ణ సేవా సమితి సభ్యులు ఢిల్లి వెంకటేశ్వర్లు, చెరుకుమల్లి కృష్ణయ్య, ఆరుట్ల లక్ష్మణాచారి, అల్లాడి నరసింహారావు,మిరియాల రమేష్, కమిటీ చైర్మన్ అల్లడి లింగారావు పలువురు ప్రజా ప్రతినిధులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: