CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కాంతన్న మన్యం మనుగడ సూపర్ ఆవిష్కరించి అభినందించిన మంత్రి కేటీరామారావు

Share it:




హైదరాబాద్ :

ఆదివాసీ తెగలలో చైతన్యం నింపడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తితో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తీసుకువస్తున్న మన్యం మనుగడ మాసపత్రికను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆవిష్కరించారు. ఆదివాసీలకు చట్టాలపై  అవగాహన కలిగించేందుకు, విద్యాపరంగా ముందడుగు వేసేందుకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ పథకాలు, సామాజికంగా, ఆర్థికంగా మరింత మెరుగుపరచాలన్న మహోన్నత లక్ష్యంతో ఈ పత్రిక తీసుకురావడం అభినందనీయమన్నారు. కాంతన్న మన్యం మనుగడ సూపర్ అంటూ అభినందనల జల్లు కురిపించారు. ఆదివాసీల అభివృద్ధికి, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గత ఆరేళ్లలో ఎంతో కృషి జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీ తెగల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ఆదివాసీల కోసం మన్యం మనుగడ మాసపత్రిక ను తీసుకువస్తున్న ప్రభుత్వ విప్ రేగా కాంతారావును ప్రయత్నం అద్భుతమన్నారు. ఆదివాసీలు అందరికీ ఇది చేరేలా బాధ్యత తీసుకోవాలన్నారు. ఏజెన్సీలో జ్ఞానదీపాలు వెలిగించడమే లక్ష్యంగా తీసుకువస్తున్న మన్యం మనుగడ మాసపత్రికను ఆవిష్కరించిన మంత్రి కేటీరామారావు కు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కృతజ్ఞతలు తెలిపారు.  కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, భద్రాచలం నియోజకవర్గ టిఆర్ఎస్ ఇన్ ఛార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు, ప్రొఫెసర్ జాడి ముసలయ్య, ఎడిటర్ కంది రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్ సహాయకులు  చందా హరికృష్ణ, శ్రీనివాసరావు, చంటి తదితరులు పాల్గొన్నారు. మొత్తం 68పేజీలతో రంగుల హరివిల్లులా ఈ మాసపత్రిక రూపొందించి. మొత్తం 40 అంశాలలో ప్రత్యేక కథనాలు ప్రతినెలా ఈ పుస్తకంలో ఉండనున్నాయి.

Share it:

TELANGANA

Post A Comment: