CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మా గోస తీర్చేది ఎవరు

Share it:

 *తారు రోడ్డు పనులు చేసుటకు అటవీ శాఖ అధికారుల తీరు  టైగర్ జోన్ ప్రతిపాదన విరమించుకోవాలి. 

 *ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఐటిడిఏ కార్యాలయం ముట్టడి

ఐటిడిఏ కార్యాలయం ఎదుట బయటించిన  ములుగు ఎమ్మెల్యే  సీతక్క.     

     *మద్దతు  తెలిపిన ములుగు ఎమ్మెల్యే సీతక్క. 

*ఏటూరునాగారం ఐటిడిఏ పీవో హనుమంతు కె జండగేకు వినతిపత్రం అందించిన ఐలాపుర్ గ్రామస్తులు.


మన్యంటీవీ ఏటూరునాగారం:


ఈ రోజు కన్నాయి గూడెం మండలం ఐలపూర్ గ్రామానికి చెందిన ప్రజలు తుడుం దెబ్బ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో  ఐలాపూర్ గ్రామం నుండి ట్రాక్టర్లు ,టూవీలర్స్ పై ర్యాలీగా బయల్దేరి వచ్చి ఏటూరు నాగారం   ఐటిడిఏ కార్యాలయం ముట్టడి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ములుగు ఎమ్మెల్యే సీతక్క 

ఈ సందర్భంగా సీతక్క  మాట్లాడుతూ ఉమ్మడి ఏటూరు నాగారం తాడ్వాయి మండలలాను టైగర్ జోన్ ప్రతిపాదనలు విరమించు కోవాలి. కొండాయి నుండి ఐలపూర్ కు త్రి ఫేస్ కరెంట్ లైన్ వేయుటకు అటవీ శాఖ అధికారులు అనుమతులు ఇవ్వాలి 

ఐలపూర్ గ్రామము నుండి కన్నాయి గూడెం మండల కేంద్రానికి వెళ్ళుటకు మంజూరైన రోడ్డు పనులు ప్రారంభిం చాలి.

దేవాదుల ప్రాజెక్టు ద్వారా కన్నా యి గూడెం ఏటూరు నాగారం మంగపేట తాడ్వాయి మండలలాకు త్రాగు నీరు సాగు నీరు అందించాలి.

2005 అటవీ హక్కుల చట్టం ప్రకారం పొడు భూములకు పట్టాలు ఇవ్వాలి గిరి వికాస్ పథకం ద్వారా మంజూరైన రైతులందరికీ బోర్లు మరియు మోటార్లు మంజూరు చేయాలని సీతక్క  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

లేని యెడల రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేస్తామని సీతక్క  అన్నారు.

అదేవిధంగా  కొమురం భీం యువజన సంఘం నాయకులు ఆలం నగేష్ మాట్లాడుతూ భారత దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్భై మూడు సంవత్సరాలు గడిచినా మా ఐలాపురం గ్రామానికి సరైన సౌకర్యాలు రోడ్డు, కరెంటు, లేక విద్య, ఉద్యోగ, వైద్య, వ్యవసాయ మరియు వివిధ రంగాల్లో రాణించే లేక పోతున్నాం అని అన్నారు. అలాగే ఊరట్టం నుండి కొండాయి, కొండాయి నుండి ఐలాపురం వరకు, ఐలాపురం నుండి మా కన్నాయిగూడెం మండల కేంద్రానికి వెళ్ళుటకు సర్వాయి గ్రామం వరకు (నాబార్డ్ )నిధులతో 39 కోట్లతో మంజూరు అయినటువంటి రోడ్డు పనులను తక్షణమే ప్రారంభించాలని అటవీశాఖ అనుమతులు ఇప్పించాలని అన్నారు. అలాగే ఉమ్మడి ఏటూరునాగారం మరియు తాడ్వాయి మండలాల టైగర్ జోన్ ప్రతిపాదనలను విరమించుకోవాలి. కొండాయి గ్రామం నుండి  ఐలాపురం గ్రామం వరకు త్రీఫేస్ కరెంటు లైన్ వేయుటకు అటవీశాఖ అనుమతులు తక్షణమే మంజూరు చేయాలన్నారు. గత పూర్వం నుండి సాగులో ఉన్న రైతుల భూములను 2017 సంవత్సరంలో భూ సర్వే చేసినటువంటి రైతులందరికీ రెవెన్యూ భూములు అన్నిటికీ పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 

ఆదివాసీ సంఘాల నాయకులు ఐలపూర్ గ్రామాల ప్రజలు 

తుడుందెబ్బ ములుగు  జిల్లా అధ్యక్షులు  పులిశె బాలకృష్ణ, ఆదివాసీ విద్యార్థి సంఘం నాయకులు  కొప్పుల రవి, 

బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు 

 ఇర్సవడ్ల వెంకన్న , ఏటూరునాగారం మండల అధ్యక్షులు చిట మట రఘు,

మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండీ అయుబ్ ఖాన్, కన్నా యిగూడెం జడ్పీటీసీ నామ కరం చందు గాంధీ,  కన్నాయిగూడెం అధ్యక్షుడు ఆఫ్సర్,  మండల నాయకుల ఆదివాసి యువకులు యువతులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: