CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గిరిజన సొసైటీ ఇసుక క్వారీ ఏర్పాటులో ఇసుక మాఫియా ఇష్టారాజ్యం

Share it:



  • గిరిజన సొసైటీ ఇసుక క్వారీ ఏర్పాటులో ఇసుక మాఫియా ఇష్టారాజ్యం 
  •  గిరిజనులలో గ్రూపులు సృష్టించి ఐక్యతనుక దెబ్బతీస్తున్నారు.

మన్యం టీవీ  ఏటూర్ నాగారం:


మారుమూల ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాలలో గిరిజనుల సొసైటీ ఇసుక క్వారీ ఏర్పాటు చేయడంలో గిరిజనేతర ఇసుక మాఫియా వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వారు ఆడిందే ఆట పాడిందే పాటగా గ్రామ సభల తీర్మానాలు సైతం వారి కనుసన్నల్లోనే మామ అనిపిస్తున్నట్లు? మారుమూల ఏజెన్సీ గ్రామీణ ప్రాంత గిరిజన ప్రజలు ఆరోపిస్తున్నారు. పీసా గ్రామ సభలు లక్ష్యం తప్పు తున్నాయని గిరిజన ప్రాంతం ఆదివాసీలు గిరిజన సంఘాల నాయకులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. సొసైటీల ఆడిట్ క్రమపద్ధతిలో సరిఅయిన పూర్తిస్థాయి కాగితాలు లేకుండానే హడావుడిగా పీసా గ్రామసభల తీర్మానం హడావుడిగా ఏర్పాటు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిర్వహణ సక్రమంగా లేని సొసైటీలకు ఇసుక క్వారీలు అప్పగిస్తే లక్షలాది రూపాయలు చేతులు మారే అవకాశం ఉందని పలువురు వాపోతున్నారు. గతంలో నిర్వహణ లోపాలు పరిశీలించకుండానే క్వారీ లు అప్పగించడం సరైన పద్ధతి కాదని సరైన క్రమపద్ధతిలో ఉన్నవాటికి  నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని పలువురు కోరుతున్నారు. సొసైటీలు ఏర్పాటు చేయడంలో స్థానిక గిరిజన ప్రజలకు ముందస్తు సమాచారం లేకుండానే గిరిజనేతర ఇసుక మాఫియా వారు గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని బినామీ పేర్లతో సొసైటీలు రిజిస్ట్రేషన్ చేసుకుని ఇసుక క్వారీలు దక్కించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని, ఇసుక మాఫియాకు అధికారులు సైతం కొమ్ముకాస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివాసీల లో గ్రూపులు సృష్టించి ఆదివాసీల ఐక్యతను దెబ్బతీస్తున్నారని ఆదివాసీ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఏటూర్ నాగారం మండల కేంద్రంలోని ఆకుల వారి గణపురం వివేకానంద పాఠశాలలో శుక్రవారం గ్రామ సర్పంచ్ ఈసం మూర్తి అధ్యక్షతన పీసా కోఆర్డినేటర్ కొమరం ప్రభాకర్ తాసిల్దార్ కుసుమ రవీందర్ ఎంపీడీవో ఫణి చందర్. ఆధ్వర్యంలో సత్య దేవా గిరిజన సొసైటీ ఇసుక క్వారీ ఏర్పాటు కోసం పీసా గ్రామ సభ నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఆకుల వారి గణపురం సత్య దేవ గిరిజన సొసైటీ కి ఇసుక క్వారీ ఏర్పాటు కోసం పీసా గ్రామ  సభలో ఆదివాసీల లక్ష్యం మర్చిపోయి ఇష్టానుసారంగా గ్రామ సభ తీర్మానం ఏర్పాటు చేశారని గ్రామస్తులు అధికారుల తీరుపై మండిపడ్డారు. ఇసుక క్వారీ ఏర్పాటు చేస్తే గ్రామంలోని ప్రతి కుటుంబానికి డబ్బులు వస్తాయని తమకు ఉపాధి దొరుకుతుందని కలలుగన్న గిరిజనులకు చుక్కెదురైంది. సొసైటీ ఏర్పాటు కూడా తమ గ్రామం ఆకుల వారి గణపురం వారికి తెలియకుండానే గిరిజనేతర ఇసుక మాఫియా వారు నాన్ ఏజెన్సీ ఈ ప్రాంతానికి చెందిన గిరిజనులను బినామీలు గా ఏర్పాటు చేసుకుని సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకుని సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు గా నాన్ ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వారిని ఉంచారని ఆకుల వారి గణపురం కు చెందిన గిరిజనులకు సభ్యత్వం సైతం లేకపోవడం చాలా బాధాకరం అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సభ జరుగుతున్న సమయంలో అక్కడున్న స్థానిక గిరిజనులు ఏం జరుగుతుందో తెలియక సతమతమయ్యారు. తెలుసుకునే ప్రయత్నం చేసే అమాయక గిరిజనుల గొంతు నొక్కేసిన ట్లు పలువురు పేర్కొంటున్నారు. ఆకులవారి గణపురం కు చెందిన వార్డు సభ్యులు గిరిజన బిడ్డ జగన్నాథం నాగసాగర్. మా మా గ్రామ గిరిజనులకు సొసైటీ గురించి పూర్తిగా ఏమీ తెలియదని తమకు ఎవరికి కూడా సొసైటీలో సభ్యుడిగా కానీ సభ్యత్వం లేదని. ఇసుక క్వారీ ఏర్పాటు గ్రామసభ జరుగుతుంది. అందరికీ డబ్బులు వస్తాయి. అని చెప్పి గ్రామ సభకు తీసుకొచ్చి గ్రామ సభలో తీరా చూస్తే వేరే నాన్ ఏజెన్సీ ప్రాంతానికి చెందిన గిరిజనులు అధిక సంఖ్యలో ఉన్నారని. వారి పేరుతోనే సొసైటీ ఏర్పాటు చేశారని తెలిసింది అని అన్నారు. గ్రామ సభలో గిరిజనేతరుల కనుసన్నల్లోనే జరిగిందని గ్రామ సభలో ప్రత్యక్షంగా ఇసుక క్వారీ నిర్వహణ కోసం ఇసుక వ్యాపారులు వెనకే ఉండి చక్రం తిప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోందన్నారు. స్థానిక గిరిజనులు గ్రామ సభకు హాజరైన వారు పూర్తిగా నిరక్షరాస్యులు కావడంతో వారు అయోమయానికి గురై నారు. గ్రామ సభలో అధికారుల తీరుపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కెల గ్రామంలో సర్పంచ్ ఈసం రామ్మూర్తి  అధ్యక్షతన పీసా గ్రామసభ నిర్వహించారు. మానస గోదావరి సొసైటీ కి ఇసుక క్వారీ కేటాయించడం కోసం ఎక్కెల లో మానస పల్లి నాన్ ఎజెన్సీ రెవెన్యూ గ్రామం పేరుతో పీసా గ్రామ సభ ఏర్పాటు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారూ నాన్ ఏజెన్సీ రెవెన్యూ గ్రామాలకు ఏజెన్సీ గ్రామాలలో గ్రామ సభలు ఏర్పాటు చేసి ఇక్కడి ప్రాంత వనరులు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత మూడేళ్ల క్రితం ఏటూరునాగారం గ్రామపంచాయతీ లో ఇసుక క్వారీ ఏర్పాటు కోసం గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామస్తులు అందరికీ ఆదాయం వస్తుందని తీర్మానం చేశారు ప్రతి కుటుంబం నుండి 150 రూపాయలు చొప్పున నాలుగు లక్షల పైగా వసూలు చేసి నట్లు గ్రామస్థులు వాపోతున్నారు కొంతకాలం ఇట్టి క్వారీ నిర్వహణ జరిగినప్పటికీ గ్రామంలో ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా పైసా కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకుల వారి గణపురం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన సొసైటీ ఇసుక క్వారీ ఏర్పాటు చేయడం కోసం గోదావరి తీరం ఇసుక క్వారీ ఏర్పాటు చేయడానికి అనుకూలమైన ప్రాంతం నాన్ ఏజెన్సీ మానస పల్లి మాత్రమే ఉందనే పలువురు వాపోతున్నారూ '              లక్ష్యం తప్పిన పీసా గ్రామ సభ'.. ఏటూర్ నాగారం గ్రామపంచాయతీ పరిధిలో మంజూరైన మూడు ఇసుక క్వారీలు నిర్వహణ లో పీసా చట్టం లక్ష్యానికి వ్యతిరేకంగా మైదాన ప్రాంతానికి చెందిన గిరిజన మహిళలతో సత్య దేవి ఇసుక క్వారీ సొసైటీ ఏర్పాటు చేసి ఏజెన్సీ గ్రామానికి చెందిన ఆకుల వారి గణపురం ఆదివాసి గిరిజనులకు సభ్యత్వం కూడా కల్పించకుండా గిరిజనేతర ఇసుక మాఫియా మైదాన ప్రాంత వాసుల ను తీసుకో వచ్చి పెసా గ్రామ సభలో కోరం లేకున్నా తమకు అనుకూలంగా తీర్మానం చేసుకోవడం సరైంది కాదని ఆదివాసీ ప్రజా సంఘాల జేఏసీ గౌరవ సలహాదారులు పొడెం రత్నం హెచ్చరించారు. కొంతమంది తనకు అనుకూలమైన వ్యక్తులతో సొసైటీ ఏర్పాటు చేసుకొనే విధానాన్ని రద్దు చేస్తూ  పేసా గ్రామ సభ్యుల అందరితో క్వారీ నిర్వహణ సొసైటీ ఏర్పాటు చేసి ఇ సహకార సంఘాల చట్టం 1964 ద్వారా రిజిస్ట్రేషన్ చేసి బాధ్యతలు అప్పగించటం ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని అని అవకతవకలు జరిగే ప్రమాదం ఉందని అన్నారు. ఇసుక వ్యాపారులు కు గిరిజనుల మీద నిజమైన ప్రేమ ఉంటే ఆర్థికంగా రాజకీయంగా ఆదివాసీల ఐక్యతకు తోడ్పాటు అందించాలని అని అన్నారు. ఆదివాసీల ఐక్యతను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తూ బినామీ పేర్లతో ఇసుక క్వారీలు దక్కించుకొని సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్న వారిని ఆదివాసీ గ్రామాలకు రానివ్వకుండా తరిమికొట్టాలని అన్నారు.

Share it:

Post A Comment: