CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టీఆరెస్ తీర్థం పుచ్చుకున్న స్వతంత్ర అభ్యర్థి ,వికలాంగుల సంఘం రాష్ట్ర నాయకురాలు అందే దాయమణి

Share it:


👉 ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన అందే దాయమణి

👉 వికలాంగ సమస్యలు పరిషారానికి హామీ 

👉వూహత్మకంగా ప్రభుత్వ విప్‌ అడుగులు 

మన్యం టీవి, పినపాక:

తెలంగాణ రాష్ట్ర ప్రభత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు సమక్షంలో  వికలాంగుల సంఘం రాష్ట్ర నాయకురాలు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 142 డివిజన్‌ అడ్డగుట్ట అభ్యర్థి అందే దయామని శనివారం టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 

అడ్డగుట్ట ఏరియాలో ప్రచారం చేసే సమయంలో ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు  స్వతంత్ర అభ్యర్ది దయామణితో మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా వికరాంగులకు సంబంధించిన సమస్యలను సీఎం  దృష్టికి తీసుకవెళ్తామని , అదేవిధంగా వికలాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

తమ సమస్యలు తెలుసుకొని మా అడ్డగుట్ట ఏరియాలో ఉన్న సుమారు 2000 మంది వికలాంగులకు ఉపాధి కల్పించేందుకు హామీ ఇవ్వడం జరిగింది. 

శనివారం ఆడ్డగుట్ట డివిజన్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో  జరిగిన సమావేశంలో వికలాంగుల సంఘం రాష్ట్ర నాయకురాలు, 

స్వతంత్ర అభ్యర్ది అందే దయామణి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వికలాంగుల సమస్యలు పరిష్కరించుకోవడం కోసం టిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు అంగీకరించినట్లు తెలిపారు. అదేవిధంగా అడ్డగుట్ట ఏరియాలో సుమారు 2 వేల కుటుంబాలకు ఉపాధి కల్పించేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  పోటీని నుండి విరమించుకొని టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్ది లింగాని ప్రసన్నలక్ష్మికి తన సంపూర్ణ మద్దతు తెలియజేశారు. 

విశ్వాసం కలిగిన నాయకుడు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గారి మీద నమ్మకంతో పార్టీ విజయానికి కృషి చేస్తానని అందే దయామణి తెలిపారు. 

పినపాక మండల టీఆరెస్ పార్టీ అధ్యక్షులు పగడాల సతీష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. 

ఈ కార్యక్రమంలో  ఆలిండియా డిజేబుల్ రైట్స్ ఫోరమ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ పులిపత్తి శ్రీనివాస్, బొంత కళాజ్యోతి, ఎలపుకొండ సరిత, సింగానేని రాములు, అందుల రాజ్య లక్ష్మీ, 

ఎస్ కొమరయ్య, భాగ్య లక్ష్మీ,

అడ్డగుట్ట టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకురాలు చింతకోరు సుజాత,  రజిని తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: