CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రాజ్యాంగ బద్ధంగానే ఏజెన్సీ మండలం గా మంగపేట : తుడుం దెబ్బ

Share it:


మన్యం టీవీ మంగపేట.    మంగపేట మండల కేంద్రంలో తుడుం దెబ్బ అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ములుగు డివిజన్ ప్రధాన కార్యదర్శి కాపుల సమ్మయ్య అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు కబ్బాక శ్రవణ్ కుమార్ మాట్లాడుతూతూ, మంగపేట మండలం రాజ్యాంగబద్ధంగా ఏజెన్సీ మండలంగా ప్రకటించబడిందని, వ్యాపార నిమిత్తం మండలానికి వలస వచ్చిన కోయ బ్రహ్మానందం ఈ ప్రాంతంలోని విలువైన భూములను అక్రమంగా సొంతం చేసుకోవడానికి చట్టంలోని లొసుగులను ఉపయోగించుకొని కోర్టు ద్వారా స్టే  తెచ్చుకొని కొన్ని సంవత్సరాలు రాజకీయ లబ్ది పొందారని ఆ సమయంలోనే ఆదివాసీల విలువైన భూములను కోయ బ్రహ్మానందం మరియు మిగతా వలసవాద గిరిజనేతరులు ఆక్రమించుకున్నారని, అన్నారు. ఆదివాసులు విద్యావంతులైన తర్వాత కోర్టు ద్వారా కేసు గెలుపొందారని, డబ్బు అధికార బలంతో గిరిజనేతరులు మరల స్టే  తెచ్చుకొని, మండల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎన్ని సంవత్సరాలు గడిచిన తుది తీర్పు ఆదివాసీలకే అనుకూలంగా వస్తుందని పేర్కొన్నారు. ఏజెన్సీలో బతుకుదెరువు కోసం వలస వచ్చిన గిరిజనేతరులు ఈ ప్రాంతంలో భూములు వనరులు ఖనిజ సంపదను దోచుకోవడానికి చట్టాలలోని లొసుగులను ఉపయోగించుకొని స్టేలు తెచ్చుకుంటూ లబ్ధి పొందుతున్నారని అన్నారు. సన్న చిన్నకారు గిరిజనేతర రైతులను వలసవాద గిరిజనేతరులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కోర్టు ఖర్చులు పేరుతో వారిని వేధిస్తున్నారని వీటన్నిటిని విజ్ఞులైన గిరిజనేతరులు గ్రహించాలన్నారు. మంగపేట  కోర్ట్ కేసు విషయంపై అసత్య ప్రచారం చేస్తున్న వారు నిజాన్ని విస్మరించడం హాస్యాస్పదం అన్నారు. వలసవాద గిరిజనేతరుల వైఖరి తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన చందంగా ఉందన్నారు బతకడానికి ఆశ్రయం కల్పించి వ్యాపార అవకాశాలు వ్యవసాయ అవకాశాలు కల్పించిన ఏజెన్సీ వాసులను మోసం చేయటం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దటమే అవుతుందన్నారు.


ఈ కార్యక్రమంలో గిరిజనాభ్యుదయ సంగం జిల్లా అధ్యక్షులు ముద్దబోయిన రవి,పొదేం సాగర్, బోదెబోయిన సూర్య తేజ, జెజ్జరి విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: