CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మహాత్మాపూలే విగ్రహ ప్రతిష్ఠాపన భూమి పూజ కార్యక్రమం

Share it:



 

మన్యం టీవీ మంగపేట. 



మంగపేట మండలంలోని తిమ్మంపేట గ్రామపంచాయతీ లోని బిసి  కాలనీలో, మహాత్మా జ్యోతిరావు పూలే 130 వ వర్ధంతిని పురస్కరించుకొని జ్యోతిరావు పూలే విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ  గోనె తిరుపతి ఆధ్వర్యంలో  (మాజీ సర్పంచ్ )భూమి పూజ కార్యక్రమం జరిగింది. 

ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా జాతీయ మిర్చి టాస్క్ బోర్డు డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మహాత్మా జ్యోతి రావు పూలె  విద్య యొక్క ఆవశ్యకత గుర్తించి 130 సంవత్సరాల క్రితమే దళిత, గిరిజన, బహుజనులకు, విద్యాదానం చేసిన మహనీయుడు అని అందువల్ల దళిత, గిరిజన, బహుజనులు విద్య, ఉద్యోగాల్లోనూ ఉపాధి , రాజకీయ రంగాల్లోనూ రాణిస్తున్నారని పూలె యొక్క గొప్పతనాన్ని కొనియాడారు. తదనంతరం ముఖ్య అతిధులుగా హాజరైన సింగిల్ విండో చైర్మన్ తోట రమేష్  మరియు ఆత్మ మాజీ చైర్మన్ పగిడిపెల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మనం ఎప్పుడు స్మరించుకోవాల్సిన మహానుభావులు ఎవరైనా ఉన్నారంటే వారు పూలె  అంబేద్కర్ లు ముందు వరుసలో ఉంటారని వారిని స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడి మీద ఉందని ఇటువంటి విగ్రహ ప్రతిస్థాపన భూమి పూజ లో మనమందరం భాగస్వామ్యం కావడం మన అదృష్టమని ఇటువంటి కార్యక్రమాలు ఇంకా గ్రామ గ్రామాన జరగాలని పేర్కొన్నారు తదనంతరం . యస్సి ఎస్టీ  మానిటరింగ్ అధ్యక్షులు రాజమల్ల సుకుమార్  మాట్లాడుతూ  మనం మనతో పాటు మన భవిష్యత్తు తరాలు కూడా పూలె అంబేద్కర్ జ్ఞాన బాటలోనే నడిచి సమసమాజ స్థాపన చేయాలని అన్నారు. ఈ కార్యక్రమం లో సిపిఎం పార్టీ కార్యదర్శి ఎల్ పీ ముత్యాలు, సిపిఎం పార్టీ జిల్లా నాయకులు  ప్రసాద్, సీఐటీయూ నాయకులు వెంకటరెడ్డి, మాదిగ జేఏసీ నాయకులు వావిలాల పోశయ్య, కాంగ్రెస్ పార్టీ ఏటూరునాగారం ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య, వావిలాల పెద్ద ఎల్లయ్య, స్వేరోస్ నాయకులు కొట్టిపాక శ్రీనివాస్, పెండేల శ్రీనివాస్,  ఎంపెల్లి వీరాస్వామి, పల్లె నాగరాజు బొట్ల కార్తీక్, మరియు స్థల దాతలు ఎదురుగట్ల రామస్వామి కృష్ణయ్య, అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి బసారికానీ హరికృష్ణ, స్వేరోస్ నాయకులు బసరికాని నాగార్జున, ఎంఅర్పీఎస్  మండల నాయకులు మల్లేష్ మాదిగ, ముక్కెర శ్రీనివాస్, లోటపెట సమ్మయ్య, కొట్టి సమ్మయ్య, జాడి సాంబశివరావు, జాడి సాంబశివరావు, గోమాసు లక్ష్మి నారాయణ, బాంబోతుల మురళి,గుండు సమ్మయ్య మొదలగు వారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.

Share it:

TELANGANA

Post A Comment: