CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పీవీ, ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చాలి ఎంఐఎం నేత అక్బరుద్దీన్

Share it:


 గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వంపై అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 4,700 ఎకరాల హుస్సేన్ సాగర్ ఈ రోజు 700 ఎకరాలు కూడా లేదన్నారు. అక్రమ కట్టడాలు కూల్చేస్తామంటున్నారు.. కానీ ఇంత వరకు అధికారులు ఆ చర్యలు చేపట్టనేలేదన్నారు. హుస్సేన్‍సాగర్ కట్టపై ఉన్న పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చాలి అని అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని ఇవ్వలేదు, ఈ ఎన్నికల్లో మాయ మాటలు చెబుతున్నారు. అసెంబ్లీలో మీ తోక ఎలా తొక్కాలో మాకు బాగా తెలుసు అని టిఆర్ఎస్ పార్టీపైన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తీవ్ర ఆరోపణలు చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: