CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పల్లె ప్రగతి పనులు త్వరిత గతిన పూర్తి చేయాలి *అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి

Share it:మన్యం టీవీ ఏటూరునాగారం:


ములుగు జిల్లాలో మంజూరైన పల్లె ప్రగతి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఆదర్శ్ సురభి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో మండల ప్రత్యేక అధికారులు మండల అధికారులతో పనుల పురోగతిపై అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పనులు పూర్తికి అధికారులు వ్యక్తిగత శ్రద్ధ తో పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 170 సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణాలకు మంజూరు. ఇవ్వగా 103 పూర్తి అయినట్లు 65 ప్రగతి లో ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో 70 వైకుంఠ దామాలు మంజూరు. చేయగా 20 నిర్మాణాలు పూర్తి కాగా 50 ప్రగతిలో ఉన్నాయని అన్నారు. అలాగే 352 పల్లె ప్రకృతి వనాలు మంజూరు చేయగా 342 చోట్ల మొక్కలు నాటడం పూర్తయిందన్నారు. జిల్లాలో 1071 కల్లాల నిర్మాణానికి మంజూరు ఇవ్వగా 5 నిర్మాణాలు పూర్తి అయినట్లు 71 ప్రగతిలో ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో 35వేల 489 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వగా 33వేల410 పూర్తయి 2 ప్రగతిలో ఉన్నట్లు ఆయన అన్నారు. 41వేల 200 ఇంకుడు గుంతల నిర్మాణాల లక్ష్యం కాగా మూడు వేల 251 పూర్తికాగా 3వేల230 ప్రగతిలో ఉన్నాయన్నారు. పనులు పూర్తయిన వెంట వెంటనే ఖర్చును ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. కల్లాల నిర్మాణాలపై రైతులను చైతన్య పరచాలని అన్నారు. మండల వ్యవసాయ అధికారి మండల విస్తీర్ణ అధికారులతో సమావేశమై ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి కి 50 కల్లాల నిర్మాణం లక్ష్యం ఇచ్చి మండల అభివృద్ధి అధికారి పూర్తికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి బుధవారం మండల ప్రత్యేక అధికారి చేపట్టే సమీక్ష సమావేశంలో వ్యవసాయ అధికారులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని గ్రామంలోని ప్రతి ప్రజా ప్రతినిధి ఇంకుడుగుంతలు తప్పనిసరిగా నిర్మించేలా చూడాలని మంజూరు లేనిచోట వెంటనే మంజూరు తీసుకోవాలని అన్నారు. గ్రామాల్లో శ్రమశక్తి సంఘాల ను గుర్తించి వారితో పనులు పూర్తి చేయాలన్నారు. ప్రతి గ్రామానికి 12 కు తగ్గకుండా కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణాలతో నీరు నిలువకుండా దోమలు వృద్ధి నివారణ జరిగి డెంగ్యూ మలేరియా లను అరికట్టవచ్చునని భూగర్భ జలాలు పెరుగుతాయని అన్నారు. వీటి ప్రయోజనాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణాలు పూర్తి అయిన చోట ఫోటో క్యాప్చరింగ్ జియో ట్యాగింగ్ పూర్తి చేయాలన్నారు. తడి పొడి చెత్తను వేరు చేయడం ఇంటి నుండి సెగ్రిగేషన్ షెడ్ వరకు పకడ్బందీగా చేపట్టాలన్నారు. తడి చెత్త కంపోస్టు పొడి చెత్త అమ్మకంతో గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూరుతుందని అన్నారు. నర్సరీలో సాయిల్ కలెక్షన్స్ మొక్కల ఎంపిక తదితర పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పనులన్నీ వచ్చే డిసెంబర్ కల్లా పూర్తవ్వాలని ఇందుకు అధికారులు సమన్వయంతో వ్యక్తిగత శ్రద్ధ తో పనులు చేయాలని ఆదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో డిఆర్ డిఓ ఏ.పారిజాతం, జెడ్పీ సిఈ ఓ ప్రసూన రాణి, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య మండల ప్రత్యేక అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారి దేవరాజ్, ఏపిడి వెంకటనారాయణ, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ రాజ్ సహాయ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: