CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మార్కెట్ లో పసుపు రైతులకు మెరుగైన మద్దతు ధర కోసం కృషి..!

Share it:


మన్యం టీవీ మంగపేట. 

-"బయ్యర్-షెల్లర్ మీట్"లో మిర్చి డైరెక్టర్ నాశిరెడ్డి సాంబశివరెడ్డి...

 ప్రతినిధి, నవంబర్ 11: దేశంలో పసుపు రైతులకు మార్కెట్ పరంగా మంచి మద్దతు ధర కల్పించి ఆదుకునేందుకు స్పెయిసెస్ బోర్డు కృషి చేస్తుందని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాశిరెడ్డి సాంబశివరెడ్డి, స్పెయిసెస్ బోర్డు ఒరిస్సా ఇంఛార్జి డి.డి గాది లింగప్ప అన్నారు. బుధవారం వెబ్ నార్ ద్వారా ఒరిస్సా పసుపు రైతుల బయ్యర్- షెల్లర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒరిస్సాలోని కండమాల్, కోరాపుట్ జిల్లాల పరిధిలో ఆదివాసీ గిరిజనులు పండించిన మేలైన పసుపుకి మద్దతు ధర కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. త్వరలోనే తెలంగాణా లో  పసుపు, మిర్చి పంటలపై బయ్యర్ - షల్లర్  మీట్ లు  ఏర్పాటు చేయాలని మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాశిరెడ్డి. సాంబశివరెడ్డి స్వైసెస్ బోర్డు అధికాసురులను కోరారు. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వరంగల్ డిడి లింగప్పని అభినందించారు. వెబ్ నార్ లో స్పెయిసెస్ బోర్డు కార్యదర్శి సత్యన్ మాట్లాడుతూ, ఇలాంటి మార్కెటింగ్ కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా చేపట్టాలని స్వైసెస్ బోర్డు డిడి  అధికారులను ఆదేశించారు.మన రైతులు పండించిన సుగంధ పంటలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి గిట్టుబాటు దరని కల్పించేందుకు తమ బోర్డు కృషి చేస్తుందన్నారు.ఈ సమావేశంలో ఒరిస్సా కందమాల్ యంపీ సమంత శ్రీ అచ్యుతానంద,కోరాపుట్ జిల్లా కలెక్టర్ మధుసూదన్ మిశ్రా, కందమాల్ కలెక్టర్ బృంద, జాతీయ స్థాయిలో ట్రేడర్స్, ఎక్స్ పోర్ట్రర్స్, , యఫ్ పి ఓ లు, శాస్త్ర వేత్తలు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: