CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఐపీఎల్ ను తలపించిన దుబ్బాక కౌంటింగ్

Share it:



సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. కౌంటింగ్‌లో రౌండ్ రౌండ్‌కూ ఆధిక్యాలు మారిపోతున్నాయి. మొదట బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత ముందంజలో ఉండగా.. ఆ తర్వాత ఐదు రౌండ్ల వరకూ బీజేపీనే ఆధిక్యంలోనే కొనసాగింది. అయితే ఆరు, ఏడవ రౌండ్‌లో మాత్రం మళ్లీ టీఆర్ఎస్ అభ్యర్థి లీడ్‌లోకి రావడంతో ఇక అన్ని రౌండ్లు ఇలానే పరిస్థితులుంటాయని ఆ పార్టీ నేతలు భావించారు. అయితే ఎనిమిదో, తొమ్మిదవ రౌండ్‌లో మళ్లీ బీజేపీనే ఆధిక్యంలోకి వచ్చింది.


ఫస్ట్ రౌండ్ ఫలితాలు..


బీజేపీ అభ్యర్థి : 3,208 ఓట్లు


టీఆర్ఎస్ అభ్యర్థి : 2,867 ఓట్లు 


కాంగ్రెస్ అభ్యర్థి : 648 ఓట్లు




సెకండ్ రౌండ్ ఫలితాలు..


బీజేపీ అభ్యర్థి :  1,561ఓట్లు


టీఆర్ఎస్ అభ్యర్థి : 1,282 ఓట్లు




మూడో రౌండ్ ఫలితాలు..


తొలి రౌండ్‌లో బీజేపీ 341,  రెండవ రౌండ్‌లో 279,  మూడో రౌండ్‌లో 750 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాగా టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత రెండో స్థానంలో ఉన్నారు. సుజాత ముందంజలో ఉంటారని అందరూ భావించినప్పటికీ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు.


నాలుగో రౌండ్ ఫలితాలు


బీజేపీ అభ్యర్థి : 13,055 ఓట్లు 


టీఆర్‌ఎస్‌ అభ్యర్థి : 10,371 ఓట్లు


కాంగ్రెస్‌ అభ్యర్థి :  2,158 ఓట్లు




ఐదో రౌండ్ ఫలితాలు..


బీజేపీ అభ్యర్థి : 16,517 ఓట్లు


టీఆర్‌ఎస్‌ అభ్యర్థి : 13,497 ఓట్లు


కాంగ్రెస్‌ అభ్యర్థి : 2,724 ఓట్లు




ఆరో రౌండ్ ఫలితాలు..


బీజేపీ అభ్యర్థి : 20,226 ఓట్లు


టీఆర్‌ఎస్‌ అభ్యర్థి : 17,559 ఓట్లు


కాంగ్రెస్‌ అభ్యర్థి : 3,254 ఓట్లు


ఏడో రౌండ్ ఫలితాలు..


బీజేపీ అభ్యర్థి : 22,762 ఓట్లు


టీఆర్‌ఎస్‌ అభ్యర్థి : 20,277 ఓట్లు


కాంగ్రెస్‌ అభ్యర్థి : 4,003 ఓట్లు




ఎనిమిదో రౌండ్ ఫలితాలు..


బీజేపీ అభ్యర్థి : 25,878 ఓట్లు


టీఆర్‌ఎస్‌ అభ్యర్థి : 22,772 ఓట్లు


కాంగ్రెస్‌ అభ్యర్థి : 5,125 ఓట్లు




తొమ్మిదవ రౌండ్ ఫలితాలు..


బీజేపీ అభ్యర్థి : 29,291 ఓట్లు


టీఆర్‌ఎస్‌ అభ్యర్థి : 25,101 ఓట్లు


కాంగ్రెస్‌ అభ్యర్థి : 5,800 ఓట్లు




పదో రౌండ్ ఫలితాలు ఇవీ..


బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కు : 31,783 ఓట్లు


టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాతకు : 28,049 ఓట్లు


కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డికి : 6,699 ఓట్లు


11వ రౌండ్‌లో బీజేపీకి తగ్గిన ఆధిక్యం..


దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్‌లో ఇప్పటి వరకూ 11 రౌండ్లు పూర్తయ్యాయి. ఇప్పటి వరకూ వేలల్లో సాగిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యం.. 11వ రౌండ్‌లో మాత్రం ఒక్కసారిగా తగ్గిపోయింది. ఈ రౌండ్‌లో కేవలం 199 ఓట్లు మాత్రమే రఘునందన్‌కు వచ్చాయి. ప్రస్తుతం 3,933 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి కొనసాగుతున్నారు. ఇప్పటి వరకూ బీజేపీకి 34,748 ఓట్లు, టీఆర్ఎస్‌కు 30,185 ఓట్లు, కాంగ్రెస్‌కు 8,582 ఓట్లు వచ్చాయి.




మరోవైపు.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన కత్తి కార్తీక నోటాతో పోటీ పడుతున్నారు. పదకొండు రౌండ్లు ముగిసే సరికి నోటాకు 318 ఓట్లు రాగా.. కార్తీకకు 319 ఓట్లు వచ్చాయి. మొత్తానికి చూస్తే.. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. కౌంటింగ్‌లో రౌండ్ రౌండ్‌కూ ఆధిక్యాలు మారిపోతున్నాయి.




ఫస్ట్ టైమ్ లీడ్‌లోకి వచ్చిన కాంగ్రెస్


దుబ్బాక ఉప ఎన్నికల కౌంటింగ్‌లో ఇప్పటి వరకూ 12 రౌండ్లు పూర్తయ్యాయి. ఇప్పటి వరకూ పూర్తవ్వగా ఇంతవరకూ కాంగ్రెస్ పార్టీ మాత్రం అడ్రస్ కనిపించలేదు. అయితే 12వ రౌండ్‌లో మాత్రం 83 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. ఒకానొక సందర్భంలో బీజేపీ ఆధిక్యం వచ్చినంత కూడా కాంగ్రెస్ ఓట్లు రాలేదు. అయితే 12వ రౌండ్‌ నుంచి కాంగ్రెస్‌కు కాస్త ఓట్లు రాలుతున్నాయి. ప్రస్తుతం ముంపు గ్రామాలకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ ముంపు గ్రామాలన్నీ కాంగ్రెస్‌కు జైకొట్టి టీఆర్‌ఎస్‌ను తిరస్కరించాయి.




12వ రౌండ్ ఫలితం


కాంగ్రెస్‌ : 2,080


బీజేపీ : 1997


టీఆర్ఎస్ : 1990 ఓట్లు వచ్చాయి. మరోవైపు బీజేపీ అభ్యర్థి ఇప్పటికీ 4,030 ఓట్లతో లీడ్‌లో ఉన్నారు. 12 రౌండ్లు పూర్తయ్యే సరికి ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి 36,745 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి 32,715, కాంగ్రెస్ అభ్యర్థి 10,662 ఓట్లు వచ్చాయి. ఫస్ట్ టైమ్ 12వ రౌండ్‌లో లీడ్‌లోకి వచ్చిన కాంగ్రెస్ ఇదే ఊపును కొనసాగిస్తుందో లేదో చూడాలి. కాగా.. దుబ్బాకలో ఇప్పటి వరకు 74,040 ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యింది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 1,98,807 కాగా.. ఇందులో మహిళా ఓటర్లు 1,00,778, పురుష ఓటర్లు 97,978 మంది ఉన్నారు. ఇప్పటి వరకూ ఎనిమిది రౌండ్లు పూర్తయ్యాయి. మొత్తం 23 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది.

Share it:

TELANGANA

Post A Comment: