CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణి చేసిన ములుగు ఎంపీపీ గండ్ర కోట శ్రీదేవి సుధీర్

Share it:



మన్యం ఏటూరునాగారం:


ఈ రోజు ములుగు జిల్లా లోని ఎంపీపీ కార్యాలయం లో తెలంగాణ  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కళ్యాణ లక్ష్మి చెక్కులను  ములుగు ఎంపీపీ గండ్ర కోట శ్రీదేవి సుధీర్ అందించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డలకు అండగా కెసిఆర్ గారు అందిస్తున్న కల్యాణ లక్ష్మి తెలంగాణలో నివసించే నిరుపేద, దళిత ,గిరిజన ,బీసీ, ఓ బి సి, మైనారిటీ ,కులాలకు చెందిన యువతుల పెళ్లిళ్ల కోసం లక్ష నూట 16 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తుంది. తెలంగాణ  ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రంలో అవతరించిన ప్రారంభంలోనే ఈ పథకాన్ని తెరపైకి తెచ్చిన ఘనత కెసిఆర్ గారిది పేద కుటుంబాలకు ఆడపిల్లల పెళ్లి చేయడం భారంగా ఉంటుందని భావించిన ప్రభుత్వం కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా 71 చెక్కులను  పంపిణి చేసిన్నారు.

ఈ కార్యక్రమంలో ములుగు జడ్పిటిసి సకినాల భవాని, జడ్పి కోఆప్షన్ మెంబర్ రియాజ్ మీర్జా, ములుగు మండలం ఎంపీటీసీలు మరియు కార్యకర్తలు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: