CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఏజెన్సీ ప్రాంతాలను, నాన్ ఏజెన్సీ ప్రాంతాలుగా మార్చే గిరిజనేతరుల కుట్రలు సాగనివ్వం -మన్యసీమ పరిరక్షణ సమితి (డోలుదెబ్బ )

Share it:



మన్యం టీవీ మంగపేట. 

మంగపేట తహశీల్ పరిధిలోని ఇరవై మూడు ట్రైబల్ రెవిన్యూ గ్రామాలను,  షెడ్యూల్డ్ ఏరియా గ్రామాలుగా, గవర్నమెంట్ అఫ్ హైదరాబాద్ రెవిన్యూ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 2nd, డేటెడ్ 16/11/1949.16th పై 1359 fashi ప్రకారం, 372 ఆర్టికల్ ప్రకారం 23 గ్రామాలు షెడ్యూల్డ్ ఏరియా గా గుర్తించబడినవి. హైకోర్టులో ఉండబడిన 17కేసులు పెండింగ్, మిస్సింగ్ తప్పుడు కేసులని,  కొట్టివేస్తూ 17/4/2014రోజున షెడ్యూల్డ్ ఏరియా గ్రామాలుగా హైకోర్టు తీర్పునిచ్చింది. గిరిజనేతరుల అరాచకాలు,   కుట్రలు సాగవు, గిరిజనేతరులు ఒక లక్ష కోట్ల సంవత్సరాలైనా కూడా ఏజెన్సీ ప్రాంతాలను, లేదా షెడ్యూల్డ్ ఏరియాల ను నాన్ ఏజెన్సీ ఏరియా లు గా, లేదా ప్రాంతాలుగా ఆర్డర్ మీరు తీసుక రాలేరని మన్యసీమ పరిరక్షణ సమితి (డోలుదెబ్బ  ) ఈ సందర్బంగా  తెలిపారు . గిరిజనేతరులు గిరిజనుల మీద, తప్పుడు ప్రకటనలను చేయడం,  గిరిజనచట్టాలను ఉల్లంగించటం, గిరిజన ప్రజలను ఉగ్రవాదులుగా, అసాంఘిక శక్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.  తెలంగాణ ప్రభుత్వం మరియు , తెలంగాణ పోలీస్ శాఖ వారు ఇటువంటి తప్పుడు చర్యలకుపాల్పడే వారిని గుర్తించి చట్టరీత్యా శిక్షించాలని మన్యసీమ పరిరక్షణ సమితి (డోలు దెబ్బ )కోరినారు. ఈ కార్యక్రమం లో మన్యసీమ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గొప్ప వీరయ్య,  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమరంవెంకటేశ్వర్లు, తుడుందెబ్బ మెంబర్  అన్నబోయిన సమ్మయ్య,తుడుం దెబ్బ మండల అధ్యక్షులు  పోలెబోయిన ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: