CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ముగ్గురు మిలిషియా సభ్యులను అరెస్టు చేసిన చర్ల పోలీసులు... వారి వద్ద నుంచి బూబి ట్రాప్స్ స్వాధీనం.

Share it:



 మన్యం టీవీ చర్ల:

ఈరోజు చర్ల ఎస్సై మరియు స్పెషల్ పోలీసులు, సి ఆర్ పి ఎఫ్ బెటాలియన్ తో కలిసి తాలిపేరు డ్యాం వద్ద పెద్ద మిడిసిలెరు కు వెళ్లే మార్గంలో వాహనాలను తనిఖీ చేయుచుండగా సుమారు ఐదు గంటల సమయంలో తిప్పా పురం నుండి పెద మిడిసిలెరు కు నడుచుకుంటూ ముగ్గురు వ్యక్తులు వస్తూ పోలీస్ వారిని చూసి పారిపోతుండగా అట్టి వ్యక్తులు ను పోలీసు వారు వెంబడించి పట్టుకొని వారిని విచారించగా వారి పేర్లు.                              1.వెట్టి భీమరాజు, తండ్రి పేరు లింగయ్య , వయసు  24 సంవత్సరాలు, కులము గుత్తి కోయ, గ్రామం కృష్టారం పాడు.

2. సున్నం నాగేశ్వరరావు, తండ్రి పేరు ముత్తయ్య, వయస్సు 25 సంవత్సరాలు, కులము కోయ, గ్రామము బత్తిన పల్లి.

3. వెల్కమ్ పెంటయ్య, తండ్రి పేరు బాలయ్య, వయసు 25 సంవత్సరాలు, కులము కోయ , గ్రామం బత్తిన పల్లి.

అని చెప్పి వారు గత మూడు సంవత్సరాల నుండి మిలీషియా సభ్యులుగా సిపిఐ మావోయిస్టు పార్టీకి పనిచేస్తున్నారు. సిపిఐ మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులు అయినా హరి భూషణ్, ఆజాద్ ,లచ్చన్న, శారద, చర్ల శబరి ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ, లాస్ కమాండర్ రజిత, చర్ల మిలిషియా కమాండర్ బాలు, ఆదేశాల ప్రకారం పని చేస్తున్నారు. వీరు గతంలో చాలా రకాల నేరాలు పాల్గొన్నారు. అందులో పెడమిదిసిలేరు దగ్గర పడిగ వాగు సమీపంలో రహదారి బ్లాస్టింగ్ మరియు కలివేరు సమీపంలో బ్యానర్ పెట్టి దానికి ఐ ఈ డి బాంబు పెట్టినారు. అదేవిధంగా సిపిఐ మావోయిస్టు పార్టీ ఆదేశాల ప్రకారం ఈరోజు పి ఎల్ జి ఏ వీక్ లో భాగంగా పోలీస్ వారి  కోసం తాలిపేరు డ్యాం వద్ద గల అడవిలో గుంటలు తీసి,ఇనుప చువ్వలు అమర్చిన 6 చెక్కలు ను అమర్చడం కోసం అదేవిధంగా పి ఎల్ జి ఏ వీక్ కి సంబంధించిన కరపత్రాలను వేయడం కోసం వస్తుండగా పోలీసు వారు ఈ ముగ్గురు మిలిషియా సభ్యులను పట్టుకుని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి బూబీ ట్రాప్ లను స్వాధీనపరచుకుని అరెస్ట్ చేయడం జరిగింది.

Share it:

TELANGANA

Post A Comment: