CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నిష్పక్షపాతంగా విచారణ జరగాలి విప్ రేగా కాంతారావు

Share it:



మన్యం టీవీ మణుగూరు:

👉 ఉపాధ్యాయ విద్యా కళాశాల భద్రాచలం లో కాంట్రాక్ట్ టీచింగ్, నాన్ టీచింగ్& నాలుగో తరగతి ఉద్యోగ నియామక పక్రీయ అనేది NCTE-న్యూఢిల్లీ నిబంధనల ప్రకారం నోటిఫికేషన్స్, రిక్రూట్మెంట్ ప్రాసెస్ లు అదేవిధంగా అధ్యాపకుల విద్యార్హతలు, సంబంధిత సబ్జెక్టులలో పర్సంటేజ్ లు ఉన్నాయా? లేవా? అలాగే జాయినింగ్ కాంట్రాక్ట్ ఆర్డర్స్, కాకతీయ యూనివర్సిటీ ర్యాటిఫీకేషన్ లిస్ట్ వివరాలు లపై విచారణ సమగ్రంగా జరగాలి.

👉 కళాశాలకు సంబంధించి CAH హాస్టల్ వసతి నీ ఎక్కడ కల్పించారు? CAH హాస్టల్ యొక్క వార్డెన్ వివరాలు దీనికి సంబంధించిన రికార్డ్స్ వివరాలు, ప్రిన్సిపాల్ అకౌంట్ నుండి CAH ద్వారా మంజూరైన 15,000 రూ. లు విద్యార్థుల అకౌంట్లోకి పంపిన బ్యాంక్ రసీదులు వివరాలను 2000 సం. నుండి 2020 సం. వరకు పూర్తి విచారణ జరగాలి.

👉 కళాశాలకు సంబంధించిన ఖర్చుల (Expenditure) వివరాలు మరియు  మెథడాలజీ ల్యాబ్ డెవలప్మెంట్& కంప్యూటర్ ల్యాబ్ కు సంబంధించిన రసీదు లపై 2000 సం. నుండి 2020 సం. వరకు పూర్తి విచారణ జరగాలి. అలాగే సంబంధిత ల్యాబ్ బిల్లులపై ఉన్న రశీదుల ప్రకారం ఖర్చుల వివరాలకు సంబంధించి సామాగ్రి ఉన్నదా? లేదా? పరిశీలించాలి.

👉 జీతభత్యాల కు సంబంధించి టీచింగ్ 18000-37100 మరియు నాన్ టీచింగ్ 15000-25500 వరకు పూర్తిగా జీతాలు ఎవరు పెంచారు? ఎలా పెంచారు? ఏ జీవో ల ప్రకారం పెంచారు? లాపై సమగ్ర విచారణ జరగాలి.

👉 గిరిజన ఉపాధ్యాయ విద్య కళాశాల అనేది ప్రభుత్వ కళాశాల నా? ప్రైవేట్ కళాశాల నా? అన్ ఎయిడెడ్ కళాశాలనా? దీని యొక్క స్టేటస్ ను తెలియజేసేటటువంటి పత్రాలపై పూర్తి విచారణ జరగాలి. కానీ గిరిజన సంక్షేమం నుండి ప్రతి ఏటా బడ్జెట్ రావడం అనేది గమనించాల్సిన విషయం మరియు స్కాలర్షిప్ లు రాబట్టడం కోసం మాత్రమే ప్రభుత్వ కళాశాలను ప్రైవేట్ కళాశాల గా చూపిస్తున్నారని బలంగా ఉంది చూపిస్తున్నారని సమాచారం.

చివరగా: అధ్యాపకులు అందరూ జీతాలు జీవోల ప్రకారం రావాలని,12నెలల వేతనం రావాలని అలాగే విద్యార్థులు 300 మందికి సరిపడా కళాశాల ప్రాంగణంలో CAH హాస్టల్ కల్పించి విద్యార్థులకు  న్యాయం చేయాలని కోరుకుంటున్నారు.

Share it:

SLIDER

TELANGANA

Post A Comment: