CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రారంభ‌మైన పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు

Share it:

మన్యం టీవి,న్యూఢిల్లీ: పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. క‌రోనా ప్ర‌భావం త‌ర్వాత మొద‌ట‌సారిగా పార్ల‌మెంట్ స‌మావేశాలు జ‌రుగుతుండ‌టంతో ప్ర‌భుత్వం అనేక జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ది. క‌రోనా నేప‌థ్యంలో పార్ల‌మెంట్ సిబ్బందితోపాటు, స‌భ్యులంద‌రికీ ‌క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. నెగెటివ్ వ‌చ్చిన‌వారికే స‌భ‌లోకి అనుమ‌తి ఇస్తున్నారు. 

క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ లోక్‌స‌భ కోలువుదీరింది. మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జీ స‌హా ఇటీవ‌ల మ‌ర‌ణించిన ప్ర‌ముఖులకు లోక్‌స‌భ సంతాపం ప్ర‌క‌టించింది. అనంత‌రం స‌భా స‌మ‌యం కుదింపు, క్వ‌శ్చ‌న్ అవ‌ర్ ర‌ద్దు‌, జీరో అవ‌ర్ కుదింపు వంటి అంశాల‌పై పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల మంత్రి ప్ర‌హ్లాద్ జోషీ లోక్‌స‌భ‌లో తీర్మానం ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు.  
మొద‌టిసారిగా లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ వేర్వేరు స‌మ‌యాల్లో కోలువుదీరుతున్నాయి. ఈరోజు ఉద‌యం 9 గంట‌ల‌కు లోక్‌స‌భ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. మ‌ధ్యాహ్నం నుంచి రాజ్య‌స‌భ స‌మావేశం కానుంది. అయితే రేప‌టి నుంచి 9 గంట‌ల‌కు రాజ్య‌స‌భ‌, మ‌ధ్యాహ్నం నుంచి లోక్‌స‌భ స‌మావేశాలు జ‌రుతాయి. 
Share it:

NATIONAL

Post A Comment: