CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సాదా బైనామాల‌కు మ‌రోసారి అవ‌కాశం : సీఎం కేసీఆర్

Share it:

మన్యం టీవి , హైద‌రాబాద్ : తెలంగాణ‌లో సాదా బైనామాల‌కు మ‌రోసారి అవ‌కాశం ఇచ్చేందుకు ప‌రిశీలిస్తామ‌ని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు శాస‌న‌స‌భ వేదిక‌గా ప్ర‌క‌టించారు. కొత్త రెవెన్యూ చ‌ట్టంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు సీఎం వివ‌ర‌ణ ఇచ్చారు. పేద‌ల‌ను కాపాడ‌టంలో దేశంలోనే తెలంగాణ ప్ర‌థ‌మ స్థానంలోఉంద‌న్నారు సీఎం. ఇదే విష‌యాన్ని వ‌ర‌ల్డ్ బ్యాంకు, యూఎన్‌వోతో పాటు ప‌లు సంస్థ‌లు చెప్పాయ‌ని సీఎం గుర్తు చేశారు. తాము ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సాదా బైనామాలు చేప‌ట్టాం. కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో అయితే వారు డ‌బ్బులు వ‌సూలు చేశారు. సాదా బైనామాల ప్ర‌క్రియ‌లో భాగంగా త‌మ ప్ర‌భుత్వంలో 1,19,000 ద‌ర‌ఖాస్తులు తీసుకుని 6,18,000 ఎక‌రాల‌కు ఉచితంగా క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ చేశామ‌ని సీఎం గుర్తు చేశారు. ఎమ్మెల్యేల కోరిక మేర‌కు సాదా బైనామాల‌ను గ‌తంలో మూడు సార్లు పొడిగించాం. మ‌రోసారి అవ‌కాశం ఇవ్వాల‌ని ప‌లువురు స‌భ్యులు కోరారు. స‌భ్యుల కోరిక మేర‌కు మాన‌వ‌తా దృక్ప‌థంతో ఆలోచిస్తాం. అవ‌స‌ర‌మైతే 15 రోజులు స‌మ‌యం ఇచ్చి అవ‌కాశం ఇస్తాం. ఈ చివ‌రి అవ‌కాశాన్ని పేద‌ల కోసం ఇస్తున్నామ‌ని తెలిపారు. పేద‌ల‌కు తామేప్పుడు అన్యాయం చేయ‌లేదు. అందుకే ఆలోచిస్తాం. సాదా బైనామాల‌కు అవకాశం ఇచ్చేందుకు కేబినెట్ చ‌ర్చ పెట్టి సానుకూల నిర్ణ‌యం తీసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌ని సీఎం కేసీఆర్ తెలిపారు.
Share it:

TELANGANA

Post A Comment: