CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పేద వాడికి న్యాయం చేసిన టిపియుఎస్ : వైద్యుల నిర్లక్ష్యం నిండు ప్రాణం బలి

Share it:


  • పేద వాడికి న్యాయం చేసిన టిపియుఎస్ 
  • ఠాగూర్ సినిమాని తలపించిన ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాకం
  • వైద్యుల నిర్లక్ష్యం నిండు ప్రాణం బలి
  • సమాచారం అందగానే  టిపియుఎస్ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యుక్షులు సామా వెంకటరెడ్డి ఆదేశాల మేరకు ఘటనా స్థలికి చేరుకుని స్టేట్ ప్రెసిడెంట్ రాజేందర్..స్టేట్ కో ఆర్డినేటర్ కాలసాని సంజయ్ రెడ్డి
  • ఆసుపత్రి వర్గాల నుండి బాధితుడికి న్యాయం చేసిన తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం 



 హైదరాబాద్, మన్యం టివి :
"వైద్యో నారాయణ హరి" అన్న నానుడికి తూట్లు పొడిచింది..హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం. కరీంనగర్ జిల్లా నుండి కొడుకు ఆరోగ్య పరిస్తితి బాగోలేక వైద్యో నారాయణ అనుకుంటూ హైదరాబాద్ లోని తార్నాకలో గల ఓ ప్రైవేటు హాస్పిటల్ కు గణేష్ అనే వ్యక్తి తన కుమారుడు ఆదిత్య ని తీసుకుని వచ్చాడు..అనంతరం హాస్పిటల్ యాజమాన్యం వారి నియమాలకు అనుగుణంగా హాస్పిటల్ లో చేర్చుకున్నారు..
హాస్పిటల్ లో చేర్చుకున్నప్పటికీ ఏదేదో ఖర్చు పేరుతో లక్షల్లో డబ్బు వసూళు చేశారు..ఇదే క్రమంలో గురువారం రోజు బాబు పరిస్థితి విషమించిందని..ఆపరేషన్ చేయాలని లేకపోతే కష్టం అని డాక్టర్లు చెప్పారు..అంతేకాకుండా ఆపరేషన్ చేయాలంటే మూడు లక్షల యాభై వేల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని..ఆ డబ్బు కడితేనే ఆపరేషన్ నిర్వాహిస్తామని డాక్టర్లు చెప్పడంతో అప్పటికే పేద ప్రైవేట్ ఉద్యోగి అయిన బాధితుడి తండ్రి అప్పు చేసి మరీ ఆసుపత్రి లో డబ్బు కట్టాడు..డబ్బు కట్టిన కొన్ని గంటలకే బాబు పరిస్తితి విషమించిందని.. ఒకసారి..హార్టబీట్ సహకరించడం లేదని మరొకసారి..ఇపుడు బాగానే ఉందని ఒకసారి చెప్పారు..మరి కొన్ని  గంటలు గడిచాక ఎంత ప్రయత్నం చేసిన బాబు ను కాపాడలేకపోయామని ఠాగూర్ సినిమా సీన్ ని ప్రదర్శించారు.. దీంతో దిక్కుతోచని పరిస్తితిలో పేషంట్ తండ్రి తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సామ వెంకటరెడ్డి కి సమాచారం అందించడంతో..వ్యవస్థాపక అధ్యక్షుని ఆదేశంతో స్టేట్ ప్రెసిడెంట్ కలమడుగు.రాజేందర్ తో పాటు స్టేట్ కో ఆర్డినేటర్ కలసాని సంజయ్ రెడ్డి.. రంగంలోకి దిగి ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం తో చర్చలు జరిపారు..అనంతరం బాధితుడుకి హాస్పిటల్ లో కట్టిన మూడు లక్షల యాబై వేల రూపాయలను సంఘం ఆధ్వర్యంలో అందించారు..దీంతో సకాలంలో స్పందిందించి తనకు న్యాయం చేసిన తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం (టిపియుఎస్)  కు బాధితుడు కృతజ్ఞతలు తెలిపాడు...ఈ సందర్భంగా సంఘం నేతలు కలమడుగు రాజేందర్..కాలసాని సంజయ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం లో ఏ ఒక్క ప్రైవేట్ ఉద్యోగికి కష్టం వచ్చిన టిపియుఎస్ సంఘం ముందుండి ఆ కష్టాన్ని పరిష్కరిస్తుందని..ప్రైవేట్ ఆసుపత్రిలు ఇకనైనా తమ వైఖరి మార్చుకుని పేద ప్రజల పట్ల దయాహృదయం కలిగి..వైద్యం చేయాలని తెలిపారు..ఈ కార్యక్రమం లో సంఘం రాష్ట్ర నేతలు రాంగోపాల్ రెడ్ది తో పాటు సనత్ నగర్ ప్రెసిడెంట్ మహేందర్ ..సభ్యుడు దినేష్, సికింద్రాబాద్ ప్రెసిడెంట్ నాగరాజు.. పుల్లయ్య..తదితరులు పాల్గొన్నారు.
Share it:

TELANGANA

Post A Comment: