CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బాలల హక్కుల ఉల్లంఘనల ఫిర్యాదు పై విచారణ

Share it:

మన్యం టీవి : జాతీయ బాలల హక్కుల కమిషన్ కు వచ్చిన ఫిర్యాదుపై చిన్నబోయినపల్లి, చల్పాక-పోల్కమ్మ వాగు గ్రామాల్లో అధికారుల బృందం విచారించింది.వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కలెక్టర్, జిల్లా సంక్షేమాధికారి ములుగు ఇరువురి ఆదేశానుసారం సోమవారం ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి, చల్పాక గ్రామాలను అధికారుల బృందం సందర్శిoచింది. గతేడాది భూపాలపల్లి జిల్లాలో జాతీయ బాలల హక్కుల కమిషన్ ఢిల్లీ ఆధ్వర్యం లో బాలల హక్కుల ఉల్లంఘనలపై ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిబిరంలో పాల్గొన్న చిన్నబోయినపల్లి, చల్పాక గ్రామాల కి చెందిన బాలలు తమ గ్రామంలో సౌకర్యాల లేమి పైన ఫిర్యాదు ఆధారంగా ఆ గ్రామాన్ని సందర్శిoచి వాస్తవ స్థితిగతులపై నివేదిక సమార్పించాలనే ఎన్ సి పి సి ఆర్ ఆదేశాల ప్రకారం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ కార్యదర్శి తదితర అధికారులు ఆయా గ్రామాల సర్పంచుల సమక్షంలో ఆయా గ్రామాలను సందర్శిoచి ఫిర్యాదు దారురాలైన బాలలను కలిసి ఫిర్యాదు చేసిన నాటి నుండి నేటి వరకు గ్రామంలో ఉన్న స్థితిగతులను గురించి వివరాలు తెలుసుకోవడం జరిగింది.
Share it:

TELANGANA

Post A Comment: