CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రగతిపథం లో వేదాంతపురం పంచాయితీ మన్యం టీవీ తో సర్పంచ్ సోమిని శివప్రసాద్

Share it:


 మన్యం టీవీ- అశ్వారావుపేట:-  అతను రెవెన్యూ శాఖ లో పని చేసిప్రజల మన్ననలు పొందారు. తరువాత విద్యావాలంటీర్ గా చేస్తున్న సమయంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది.  వేదాంతపురం నూతన పంచాయతీ కావడంతో ఏకగ్రీవం చేసుకుందామని గ్రామస్థులు నిర్ణయించారు. పంచాయతీ ప్రజలు శివప్రసాద్ ని ఏకగ్రీవంగా ప్రకటించారు. అనుకోని పరిస్థితుల్లో  మరల ఎన్నికలు నిర్వహించవలసి రావడంతో స్వతంత్ర అభ్యర్థిగా సోమినేని శివప్రసాద్ ఎన్నికల బరిలో నిలిచి సర్పంచ్ గా విజయం సాధించారు. నూతన పంచాయతీ కావడంతో సర్పంచ్ శివప్రసాదరావు కు సమస్యలు స్వాగతం పలికాయి. కొత్త పంచాయతీ కావడంతో కనీసం వీధి దీపాలు లేవని, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడటం, విష జ్వరాలు,సీజనల్ వ్యాధులు, విజృంభించాయి .తనపై నమ్మకం తో సర్పంచ్ గా గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా... అభివృద్ధి పనులు వేగవంతం చేశారు. స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు , హరితహారం విజయవంతంగా నిర్వహిస్తున్న ట్లు ఆయన తెలిపారు.  ముఖ్యంగా ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు తీయించానని, తద్వారా దోమలను నివారించి,  విష జ్వరాలు శాతం పూర్తిగా తగ్గిందన్నారు.  త్రాగునీటి సరఫరా విజయవంతం గా సాగుతున్నదని, ఇక కరోనా ని ఈరోజు వరకు కూడా వాళ్ల  గ్రామ పంచాయతీ నందు రాకుండా ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించి  చైతన్యపరిచానని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తద్వారా ఈ సంవత్సరం లో కనీసం సాధారణ జ్వరం కూడా నమోదు కాకుండా చేసానని తెలిపారు. ప్రతీ సంవత్సరం వరద  ముంపునకుకు గురి అవుతున్న  ఇళ్ళను ఈ సంవత్సరం వరదలకు కు గురికాకుండా చేసానని, డంపింగ్ యార్డు పనులు పూర్తి అయినదని, క్రెమిటోరియం ఆఖరి దశలో ఉన్నదని, పల్లెప్రకృతి వనం దాతల సహాయం తో జిల్లాలో మొదటిదిగా ఉండాలని ప్రస్తుతం కృషి చేస్తున్నాను అని ఆయన మన్యం టీవీ కి తెలిపారు.నూతన రెవిన్యూ చట్టం పట్ల శివప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. పోడు భూములకు పట్టాలు ఇప్పించే అందుకు కృషి చేస్తానని సర్పంచ్ అన్నారు.
Share it:

TELANGANA

Post A Comment: