CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్ ట్రైలర్‌ రిలీజ్

Share it:

కార్గిల్ యుద్ధంలో విమానం నడిపిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన గుంజన్ సక్సేనా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్. ఈ చిత్రం ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది. ఈ సినిమా ఎంత బాగుందో, ఎంత మందిలో స్ఫూర్తి నింపుతుందో అనడానికి ఈ ట్రైలర్‌లో ఉండే ఒక్క డైలాగ్‌ చాలు. ​‘నేను దీన్ని చేయగలను’ అని చెప్పడం ద్వారా మీరు గౌరవం సంపాదించరు, మీరు మీ తలని కిందికి ఉంచి, చేయడం ద్వారా సంపాదించగలరు’. ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ గుంజన్‌ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో జాన్వీ చాలా ప్రొఫెషనల్‌గా కనిపిస్తోంది. ఈ సినిమాలో విమానం నడపాలి అనే ఆసక్తి ఉన్న అమ్మాయిని సమాజం ఎలా నిరుత్సాహాపరుస్తుంది. వాటిని అధిగమించి ఆమె ఎలా తన కలని నెరవేర్చుకుంటుంది అనేది చాలా అద్భుతంగా చూపించారు. అదేవిధంగా భారతదేశ చరిత్రలో ముఖ్యమైన యుద్ధం కార్గిల్‌ వార్‌లో విమానం నడిపిన మొదటి మహిళగా గుంజన్‌ రికార్డు సంపాదించారు. తన పనితో అ‍మ్మాయిలు బలహీనులు కఠినమైన పనులు చేయలేరు అని చెప్పిన వారికి తన సత్తా చూపించారు. పనిచేసే చోట మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా ఈ సినిమాలో చూపించినట్లు అర్థం అవుతుంది.
Share it:

CINEMA

Post A Comment: