CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

AP

ఎడ్లపాడు మండలంలోని వంకాయలపాడులో ఐటీసీ సంస్థ ఏర్పాటు

Share it:

 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాలో పర్యటించారు. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలంలోని వంకాయలపాడులో ఐటీసీ సంస్థ ఏర్పాటుచేసిన గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ నీ ప్రారంభించారు.  అనంతరం ఆ యూనిట్ లో పర్యటించి మొత్తం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఐటీసీ సంస్థకు అభినందనలు తెలియజేశారు. ఈ గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ యూనిట్ వల్ల వేలాది మంది రైతులకు ఉపాధి కలుగుతుందని పేర్కొన్నారు. 

దాదాపు ₹200 కోట్లతో 6.2 ఎకరాల స్థలంలో ఈ సంస్థను నిర్మించడం జరిగింది.  సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్ చేసి ఎగుమతి చేసే విధంగా.. ఈ పార్క్ నీ ఐటీసీ సంస్థ అభివృద్ధి చేయడం జరిగింది. యూనిట్ వల్ల దాదాపు 14 వేల మంది రైతులకు ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. అంతేకాదు రెండో దశ యూనిట్ నీ ఏర్పాటు చేయడానికి ఐటిసి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతుల ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుందని రాష్ట్ర రైతులను చెయ్యి పట్టి ముందుకు నడిపించే బాధ్యతను ఐటీసీ తీసుకొందని పేర్కొన్నారు.

 ఇంకా రైతు భరోసా కేంద్రాల విధానం ద్వారా రైతుల జీవితాల్లో మరింత మార్పును తీసుకురావడానికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.   ఈ క్రమంలో గత మూడు సంవత్సరాల నుండి దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి స్థానంలో నిలిచిందని సీఎం జగన్ గర్భంగా తెలియజేశారు. అంతేకాదు 3450 కోట్ల రూపాయలతో ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాట్లు వల్ల 33,000 మందికి ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రైతులకు వరమని స్పష్టం చేశారు. రైతుల పంటకు మంచి గిట్టుబాటు దక్కుతుందని.. ఐటీసీ కంపెనీకి ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో సహకారమందుతుందని పేర్కొన్నారు.

Share it:

AP

Post A Comment: