CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తమన్నా పెళ్లి చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు

Share it:

 


 మిల్కీ బ్యూటీ తమన్నా వయసు మూడు పదులు దాటేసింది. చాలా కాలంగా ఈమె పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అదుగో తమన్నాకు పెళ్లి ఇదుగో తమన్నాకు పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి.  ప్రతిసారి గాలి పుకార్ల వలె మిగిలిపోయాయి. సినిమా ప్రమోషన్స్, ఇంటర్వ్యూలలో తమన్నాను ఈ మధ్య పెళ్లి ఎప్పుడనే ప్రశ్న వేధిస్తుంది. నాకు పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలని ఉంది. దేనికైనా సమయం రావాలి. పెళ్లి కుదిరితే ముందు మీకే చెబుతానని మాట దాటేస్తూ వస్తుంది. తాజాగా మరోసారి తమన్నా పెళ్లి చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Tamanna Marriage  ముంబైకి చెందిన వ్యాపారవేత్త వరుడు అట. కుటుంబ సభ్యులకు అబ్బాయి గుణగణాలు, ప్రొఫైల్ నచ్చడంతో ఓకే చేశారట. తమన్నా సైతం పచ్చ జెండా ఊపిన నేపథ్యంలో పెళ్ళికి భాజా మోగనుంది అంటున్నారు. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. కాగా తమన్నా పెళ్లి పై స్పష్టత రావాలంటే కొద్ది రోజులు వేచి చూడాలి. లేదంటే తమన్నా స్పందించాలి.  తమన్నాతో పాటు టాలీవుడ్ లో స్టార్ గా వెలిగిన కాజల్ పెళ్లి చేసుకొని చక్కగా సెటిల్ అయ్యింది. పెళ్ళికి సమయం వృధా కాకుండా లాక్ డౌన్ లో చేసుకుంది. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరుకావడంతో ఖర్చు ఆదా అయ్యింది. కాజల్ ఒక అబ్బాయిని కూడా కన్నారు. తమన్నా మాత్రం ఇంకా కెరీర్ అంటూ మీన మేషాలు లెక్కబెడుతున్నారు. ఈ జెనరేషన్ హీరోయిన్స్ లో తమన్నా, కాజల్ సుదీర్ఘ కెరీర్ అనుభవించారు.   

 Tamanna Marriage  తమన్నా పరిశ్రమకు వచ్చి 15 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పటికీ ఆమెకు స్టార్స్ పక్కన నటించే బడా ఆఫర్స్ వస్తున్నాయి. చిరంజీవికి జంటగా భోళా శంకర్ మూవీ చేస్తున్నారు తమన్నా. దర్శకుడు మెహర్ రమేష్ వేదాళం రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లిగా నటిస్తుండగా తమన్నా హీరోయిన్. అలాగే సత్యదేవ్ కి జంటగా గుర్తుందా శీతాకాలం మూవీలో నటిస్తున్నారు. వీటిలో పాటు ఒక హిందీ, మరొక మలయాళ చిత్రం చేస్తున్నారు. కెరీర్ జోరుగా సాగుతున్న నేపథ్యంలో తమన్నా పెళ్లి గురించి మర్చిపోయారు. తమన్నా ప్రస్తుత వయసు 32 ఏళ్ళు కాగా ఈ ఏడాదైనా పెళ్లి పీటలు ఎక్కుతుందో లేదో చూడాలి.

Share it:

CINEMA

Post A Comment: