CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గత నెలలో రాయల్ ఎన్ఫీల్డ్ ఏకంగా 82 వేల యూనిట్ల బుల్లెట్ బండ్ల అమ్మకాలు

Share it:

 


'నీ బుల్లెట్ బండి ఎక్కి వచ్చేత్తాపా డుగ్గు డుగ్గు డుగ్గు అని' ఇటీవల కాలంలో ఈ పాట వైరల్ అయినంతగా మరి పాట కాలేదు.  అన్నట్టు ఈ పాట తర్వాతే బుల్లెట్ బండి క్రేజ్ అమాంతం పెరిగింది. అంతేకాదు బుల్లెట్ బండి పై యువత మరింత ఇష్టాన్ని పెంచుకుంది. ఫలితంగా ఒకప్పుడు రోడ్లపై అరుదుగా కనిపించే బుల్లెట్ ఇప్పుడు విరివిగా దర్శనమిస్తోంది.. పెట్రోల్ ధర పెరిగినా, ధర ఆకాశంలో విహరించినా యువత లెక్కపెట్టడం లేదు. రాజసానికి దర్పణంగా నిలిచే బండిని కొనుగోలు చేయడంలో అమితాసక్తిని ప్రదర్శిస్తోంది. విక్రయాలు ఒకసారిగా పెరగడంతో రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు కొత్త వేరియంట్లతో ముందుకు వస్తోంది.  

82 వేల యూనిట్లు  గత నెలలో రాయల్ ఎన్ఫీల్డ్ ఏకంగా 82 వేల యూనిట్ల బుల్లెట్ బండ్ల అమ్మకాలు సాగాయి.. బుల్లెట్ బండి పాట బ్రిటన్ లోను పాపులర్ అయిందేమో అక్కడ కూడా అమ్మకాల్లో దుమ్ము రేపుతోంది. ఎన్ఫీల్డ్ లేటెస్ట్ రేంజ్ అయిన మెతేయోర్ 350, క్లాసిక్ 350, ఇంటర్ సెప్టార్ 350 వంటి బైకులు యూకే లో ఈ ఎడారి అమ్ముడుపోయిన టాప్ టెన్ మోటార్ సైకిళ్ళల్లో స్థానం సంపాదించుకున్నాయి. ఇటీవల ఈ కంపెనీ హంటర్ 350 అనే మోడల్ ని లాంచ్ చేసింది. ఈ వాహనానికి వినియోగదారుల నుంచి ఊహించని స్పందన లభిస్తున్నది.  వచ్చే ఏడాదిలో  రాయల్ ఎన్ఫీల్డ్ ప్రస్తుతం 3 ఎయిర్ కూల్డ్ ఇంజన్ ప్లాట్ఫామ్స్ అయినా a349 సిసి సింగిల్ సిలిండర్, ఏ 411సిసి సింగిల్ సిలిండర్, ఏ 648 సిసి సిలిండర్ పై బైకులు తీసుకొస్తోంది.. తమ నుంచి వచ్చే ఏ కొత్త బైక్ అయినా అది తొలిత భారత్ మార్కెట్ లోనే విడుదల అవుతుందని రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ చెబుతోంది.. 

భారతీయ రోడ్లపై ప్రస్తుతం ఈ కంపెనీ న్యూ రేంజ్ బైక్లను టెస్ట్ చేస్తోంది.. అలాగే నెక్స్ట్ జనరేషన్ హిమాలయన్ ఆఫ్ రోడ్ కోసం 450 సిసి ఇంజన్ ప్లాట్ ఫామ్ ను ఆర్ఈ డెవలప్ చేస్తోంది.. సూపర్ మెటేయోర్ 650 వచ్చే ఏడాది భారత్ లోనే లాంచ్ కాబోతోంది. రెండు వేరియంట్లు స్టాండర్డ్, టూరింగ్ రకాల్లో వస్తోంది.  కొత్త మోటార్ సైకిల్ కు శక్తినిచ్చే 648 సీసీ, సమాంతర ట్విన్ సిలిండర్ ఇంజన్ 47 పిఎస్, 52 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. స్లిప్ అసిస్టెంట్ క్లచ్ తో 6 స్పీడ్ గేర్ బాక్స్ అమర్చారు. 320 ఫ్రంట్, 300 ఎం ఎం రియర్ డిస్క్ బ్రేక్ లు ఉన్నాయి. అలాగే డ్యూయల్ యాంటీ లాగ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. 19 అంగుళాల ఫ్రంట్ వీల్, 16 అంగుళాల వెనక వీల్ తో వస్తోంది.

Share it:

BUSINESS

WORLD

Post A Comment: