CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

“పుష్ప 2” ఫస్ట్ లుక్ అప్ డేట్

Share it:

 


గత ఏడాది డిసెంబర్ 17వ తేదీన “పుష్ప” మొదటి భాగం విడుదలయ్యి అరాచకం సృష్టించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో ఫస్ట్ టైం దర్శకుడిగా సుకుమార్ కి హీరోగా బన్నీకి ఈ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. ఊహించని విధంగా కలెక్షన్లు సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద అనేక రికార్డులు క్రియేట్ చేసింది. దీంతో ఇప్పుడు వస్తున్నా “పుష్ప 2” పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒక మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా “పుష్ప 2” కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజుల క్రితం స్టార్ట్ అయింది. ఇలాంటి తరుణంలో “పుష్ప 2″కి సంబంధించి ఫస్ట్ లుక్ వీడియో… లేదా ఫోటో డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.  

“పుష్ప” మొదటి భాగం గత ఏడాది డిసెంబర్ 17 వ తారీకు విడుదల చేశారు. ఆ సెంటిమెంట్ తో “పుష్ప 2” ఫస్ట్ లుక్ అప్ డేట్ ఇవ్వటానికి మేకర్స్ రెడీ అయినట్లు సమాచారం. ఒకవేళ డిసెంబర్ 17 కాకపోతే అంతకు ముందు రోజే అనగా డిసెంబర్ 16వ తారీకు రిలీజ్ అవుతున్న “అవతార్ 2″కి స్క్రీనింగ్ చేయడానికి సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది. “పుష్ప 2” షూటింగ్ వాస్తవానికి ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలలో స్టార్ట్ చేయాలని సినిమా యూనిట్ భావించింది.  కానీ “పుష్ప” మొదటి భాగానికి భారీ ఎత్తున రెస్పాన్స్ రావడంతో… రెండో భాగం అంతకుమించి తీయాలని చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ క్రమంలో స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు కూడా దర్శకుడు సుకుమార్ చేయడం జరిగింది. సో మొత్తం మార్పులు చేర్పులు చేసి అక్టోబర్ కి ఒక కొలిక్కి తీసుకొచ్చి.. నవంబర్ నెల నుండి షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇలాంటి తరుణంలో “పుష్ప” రిలీజ్ అయిన రోజు “పుష్ప 2” ఫస్ట్ లుక్ అప్ డేట్ ఇస్తే బాగుంటుందని మేకర్స్ డిసైడ్ అయినట్లు సమాచారం.

Share it:

CINEMA

Post A Comment: