CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు

Share it:

 


చంద్రబాబు నాయుడు ఎక్కడ మాట్లాడినా 2024 ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అని చెబుతున్నారు. ఈ కామెంట్లు వైసీపీకి సంతోషాన్ని కలిగిస్తుంటే టీడీపీ నేతలను మాతం బాధ పెడుతున్నాయి.  చంద్రబాబు లేని టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. లోకేశ్ టీడీపీ బాధ్యతలను తీసుకున్నా ఆయన కింద పని చేయడానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆసక్తి చూపరు.  

చంద్రబాబులా ప్రజల్లో, కార్యకర్తల్లో, నేతల్లో నమ్మకాన్ని కలిగించడంలో లోకేశ్ ఫెయిలవుతున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైతే మరో 30 సంవత్సరాల పాటు నేనే సీఎంగా ఉంటానని జగన్ భావిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు మినహా తనకు గట్టి పోటీ ఇచ్చే మరో రాజకీయ నేత లేరనే భావనను జగన్ కలిగి ఉండటంతో ఆయన ఇలాంటి కామెంట్లు చేస్తున్నారని పొలిటికల్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.  అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఇతర పార్టీలతో పొత్తులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రాజకీయంగా తాను ఎదిగే అవకాశం ఉన్నప్పటికీ చేతులారా ఆ అవకాశాన్ని కోల్పోతున్నారని మరి కొందరు చెబుతున్నారు. 

తారక్ కు టీడీపీ బాధ్యతలు ఇస్తే పార్టీకి మంచి జరుగుతుందని కొందరు సూచిస్తున్నా టీడీపీలో తారక్ పొలిటికల్ ఎంట్రీ గురించి భిన్నాభిప్రాయాలు ఉండటంతో ఆ దిశగా అడుగులు పడటం లేదు.  చంద్రబాబు అపర చాణిక్యుడు అని పొలిటికల్ వర్గాల్లో పేరుంది. అంత మేధావి అయిన చంద్రబాబు టీడీపీకి సరైన నేతను ఎంపిక చేస్తారేమో చూడాల్సి ఉంది. టీడీపీ బాధ్యతలను నందమూరి కుటుంబానికి అప్పగిస్తే బాగుంటుందని కొంతమంది సూచనలు చేస్తుండగా రాబోయే రోజుల్లో ఆ దిశగా అడుగులు పడతాయేమో చూడాల్సి ఉంది.

Share it:

AP

NATIONAL

Post A Comment: