CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో వీ ఆర్ ఏ ల వినూతన నిరసన

Share it:

 
మన్యం మనుగడ, మంగపేట : ములుగు జిల్లా మంగపేట మండలంలో వీఆర్ఏ ల నిరవధిక సమ్మె 63 వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో మండలంలో ఉన్న వీఆర్ ఏ లు అందరూ బతుకమ్మ పండగ సందర్భంగా ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మను పేర్చి బతుకమ్మ పాటలు పాడుతూ లయ బద్దంగా ఆటలు ఆడి తమ బాధలను, డిమాండ్ లను బతుకమ్మ కు పాట రూపంలో విన్నవించుకుంటూ, ఈ పండుగ పూర్తయ్యే నాటికీ వీఆర్ఏ లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలని మొక్కుకున్నారు. ఈ విధంగా మండలం లోని వీఆర్ఏ లు తమ నిరసన తెలియజేసారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, వీఆర్ఏ ల కుటుంబాలలో ఆనందం నింపాలని కోరుకున్నారు.

 ఈ కార్యక్రమంలో వీఆర్ఏల మండల అధ్యక్షుడు పాగ బాబు, ఉపాధ్యక్షుడు కర్రి నాగార్జున,ప్రధాన కార్యదర్శి కర్రి నర్సింహ మూర్తి, కోశాధికారి మాటూరి కౌసల్య , సభ్యులు,నర్సింహారావు, గౌసియా బేగం, సమ్మయ్య,రాజేశ్వరి,కనుకు సమ్మక్క,పగిడమ్మా, రాణి, రాము, ఈశ్వరమ్మ, శ్రీను,మాధవి, ఖాజా హుస్సేన్ , కార్తిక్, ముత్తయ్య, ఎల్లమ్మ,ముజాఫర్, వెంకటనర్సమ్మ,శిరీష, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: