CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సీఎం కేసీఆర్ గిరిజన రిజర్వేషన్ల కోసం తీసుకున్న నిర్ణయం హర్షిణియం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

Share it:



మన్యం టివి మణుగూరు:


హైదరాబాద్ తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ,తెలంగాణ రాష్ట్ర గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు, మహబూబాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు ఎంపీ మాలోత్ కవిత, పలువురు గిరిజన కార్పొరేషన్ చైర్మన్ లు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ గిరిజన రిజర్వేషన్ల కోసం తీసుకున్న నిర్ణయం హర్షిణియం అని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గిరిజన రిజర్వేషన్ 10% శాతం పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు అన్నారు.దీంతో కేసీఆర్ కు పేరు వస్తుందని ఆలోచించిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తొక్కి పెట్టింది అని, బిజెపి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని భావించిన సీఎం కేసీఆర్ రిజర్వేషన్లు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు అన్నారు.దళిత బంధు మాదిరిగా పేద గిరిజనుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన బంధు పథకాన్ని ప్రకటించడం సంతోషకరమన్నారు.గిరిజనులు ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తున్న కలలను సీఎం కేసీఆర్ ప్రకటనలతో సహకారమైంది అన్నారు.ఈ పథకం గిరిజన జీవితాలలో వెలుగులు నింపునున్నది అని, ఉమ్మడి రాష్ట్ర పాలకులు కారణంగా గిరిజనలు ఇబ్బందుపడ్డారు అని,ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పలు పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన బందును ప్రకటించడం సంతోషంగా ఉంది అని గిరిజన బాంధవుడు కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.సీఎం కేసీఆర్ గిరిజన సంక్షేమలకు పెద్దపీట వేస్తున్నారు అని, అడవి భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు ఆకుపత్రలు ఇవ్వడానికి చర్యలు చేపట్టారు అన్నారు. రైతు బంధు,రైతు బీమా, ఐటీడీఏ పథకాలు గిరిజనలకు ప్రయోజనంగా చేకూరుతున్నాయని అన్నారు. ఈ సందర్బంగా కార్యక్రమం లో పాల్గొన్న పినపాక నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఆదివాసి ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులు, టిఆర్ఎస్ పార్టీ ఆదివాసి నాయకులు మాట్లాడుతూ, గిరిజనలు ఉపాధి మెరుగుపరిచేందుకు సీఎం కేసీఆర్ గిరిజన బంధు పథకం అమలు చేయడం చారిత్రకమైంది అని,గత ప్రభుత్వాలు గిరిజనులను ఏమాత్రం పట్టించుకోలేదు అని దీంతో జిల్లాలోని గిరిజనులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది అన్నారు.ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు.తాజాగా హైదరాబాదులోని గిరిజన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ప్రకటించడం సంతోషదాయకమన్నారు.


ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ,జిల్లా టిఆర్ఎస్ పార్టీ ఆదివాసి నాయకులు వట్టం రాంబాబు,ఆదివాసి ఉద్యోగుల సాంస్కృతిక మరియు సంక్షేమ సంఘం డివిజన్ అధ్యక్షులు పోలబోయిన అనిల్ కుమార్, ఉపాధ్యాయులు,పడిగా అంజయ్య,పారిజాతం శ్రీను, తదితరులు ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: