CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆకస్మిక పర్యటన లో భాగంగా తనిఖీలు నిర్వహించిన జిల్లా కలెక్టర్.

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య బుధవారం మంగపేట తహసీల్దార్ కార్యాలయంను ఆకస్మికంగా సందర్శించి వివిధ అంశాలపై తనిఖీ నిర్వహించారు.అనంతరం ఆయన వివిధ అంశములపై స్థానిక తహశీల్దార్ తో సమీక్షించారు.తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణములో నిర్మిస్తున్న గెస్ట్ హౌస్ ను తనిఖీ చేసి దాని నిర్మాణ పని త్వరితగతిన పూర్తిగావించాలని సంబంధించిన అధికారులనుఆదేశించారు.ఆపై తహసీల్దార్ కార్యాలయములోతహసీల్దార్ తో ధరణి , ప్రజావాణి, కోర్టు కేసులు తదితర అంశాలపై సమీక్షించి సంబంధిత అన్ని అంశాలను ఎలాంటి పెండింగ్ లేకుండా పూర్తి చేయుటకు ఆదేశములు జారీచేశారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి కర్నాటి శ్రీధర్ ని వేసవి కాలంలో మండలంలోని ఏ గ్రామoలో కూడా త్రాగు నీటి సమస్య రాకుండా తగు చర్యలు తీసుకొనుటకు ఆదేశించారు. ఏ ప్రాంతంలోనైనా మంచినీటి సరఫరా అవసరం ఉన్నచో త్వరితగతిన సరఫరా చేయవలసిoదిగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు.మండలంలోని పలు అవెన్యూ ప్లాంటేషన్ ( రోడ్డుకు ఇరువైపులా చెట్లు నాటడం ) అభివృద్ధి చేయవలసిoదిగా ఆదేశించారు.మల్లూరు హేమాచల టెంపుల్ ను టూరిజం స్పాట్ గా గుర్తింపు పొందినందున టెంపుల్ ను సందర్శించే భక్తులకు తగిన సదుపాయాలు కల్పించేయాల్సిందిగా ఎండోమెంట్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ కృష్ణ ఆదిత్య వెంట పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: