CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన మండల అధ్యక్షులు పెటేటి నర్సింహారావు.

Share it:


ములకలపల్లి:మన్యంమనుగడ (న్యూస్):

మండలం లోని జగన్నాధపురం గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మండలఅధ్యక్షుడు పెటేటి నర్సింహారావు ప్రారంభించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు పై టిఆర్ఎస్ మరియు బీజేపి ప్రభుత్వాలు కలసి రైతులను మోసగిస్తున్నాయని,ధాన్యం కొనుగోలు సమస్యను సృష్టించిందే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలని, రైతులను మభ్యపెట్టెందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర పై చావు డప్పు డ్రామాను ప్రారంభించారని,ఆరోపించారు.

రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చెయ్యకుండా టి ఆర్ ఎస్,మరియు బీ.జే.పి.ప్రభుత్వాలు మీడియాలో రాజకీయం యుద్ధం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం అన్నదాతలకు పుట్టినిల్లు,అలాంటి అన్నదాతలను రోడ్డు మీద వేసిన ఘనత టి ఆర్ ఎస్ ప్రభుత్వానిదేనాని,2023 లో రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి రాగానే కొనుగోలు కేంద్రాలను తెరిచి మద్దతు ధరకు పంటలను కొనుగోలుచేస్తుందని, కాంగ్రేస్ పార్టీ తరుపున మండల అధ్యక్షులు భరోసా ఇస్తున్నామని తెలిపారు.ఈ రాష్ట్రం లో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం₹ 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండు చేశారు.టి.ఆర్.ఎస్. ప్రభుత్వానికి ధాన్యం కొనుగోలు పై దమ్ముంటే ఢిల్లీ లో దీక్ష చెయ్యాలని డిమాండు చేశారు.కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకీ రాగానే 2 లక్షలు రూపాయలు రైతురుణ మాపి చేస్తాం అని రాహుల్ గాంధీ తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెటేటి నర్సింహారావు, అశ్వారావుపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొరంపల్లి చెన్నారావు,పిఏసియస్ ఉపాధ్యక్షలు పామర్తి చందారరావు,సీనియర్ నాయకులు గుంటూరు ముతయ్య, పామర్తి జగన్నాధరావు,మేడిశెట్టి సూరయ్య, షేక్ ఖాదర్ బాబా,బుగ్గరాపు సత్యనారాయణ, పాలకుర్తి రవి, పామర్తి కృష్ణ, మేకపోతుల మారేష్, ప్రజ్జురి రాఘవులు,పలగాని బాబురావు, వరుకుటీ కిట్టయ్య, ప్రజ్జురి రాము,మేకపోతుల శ్రీను,మేకపోతుల వెంకటేశ్వరరావు,పాలగాని సోమనాద్రి,పామర్తి శ్యామ్,పామర్తి కిరణ్,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: