CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జేడీ ఫౌండేషన్ సేవలు వెలకట్టలేనివి : ఎమ్మెల్యే పొదెం వీరయ్య.

Share it:

 


  • నిరుపేద ముస్లిం యువతికి వివాహం కొరకు ఆర్థిక చేయూత... పెద్ద మనసు చాటుకున్న చాంబర్ ఆఫ్ కామర్స్.

మన్యం టీవి వెబ్ డెస్క్:

చేసిన మేలు ఎప్పటికీ మరిచిపోమని మరోసారి నిరూపించారు జేడీ ఫౌండేషన్ భద్రాచలం వారు, ఈ మేరకు లాక్డౌన్ సమయంలో జేడీ ఫౌండేషన్& ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో యాచకులకు అన్నదానం చేసిన విషయం విదితమే, ఈ అన్నదానానికి రెండు పూటలా భోజనం వండిన తండ్రి లేని ఒక నిరుపేద ముస్లిం కుటుంబంలోని యువతి వివాహానికి ఆర్థిక సహాయం అందజేయడానికి ముందుకు వస్తే, మేమున్నాం మీకు అండగా అని పెద్ద మనసు చాటారు ఛాంబర్ లోని వ్యాపారులు . ఈ మేరకు భద్రాచలం శాసనసభ్యులు శ్రీ పొదెం వీరయ్య గారి నివాసంలో చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి శ్రీ కంభంపాటి సురేష్ కుమార్ గారి సమక్షంలో భద్రాచలం సుభాష్ నగర్ కాలనీ కి చెందిన షేక్ చాందిని అనే యువతి కి 70 వేల రూపాయల నగదు చెక్కు రూపం లో అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ వీరయ్య మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా జెడి పౌండేషన్ ప్లాస్టిక్ నిషేధం తో పాటు అనేక రకాలుగా చేస్తున్న సేవలు వెలకట్టలేవని వారికి అన్ని రకాలుగా సహకరిస్తున్న చాంబర్ ఆఫ్ కామర్స్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. తానుకూడా షాదీ ముబారక్ ద్వారా వచ్చే మొత్తాన్ని త్వరగా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా జేడీ పౌండేషన్ కన్వీనర్ మురళీమోహన్ కుమార్ మాట్లాడుతూ ఈ యువతికి సహాయం కొరకు 30వేల రూపాయలు చాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా, మిగిలిన 40 వేలు శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారు, జేడీ ఫౌండేషన్ సభ్యులు మరియు ఎక్స్ట్రా మైల్ వారి సహకారంతో అందించామని అలాగే పెళ్లి కూతురు కి కావలసిన వంట సామగ్రిని we are with you సంస్థ వారు అందించారని, ఈ యువతి వివాహం కొరకు సహకరించిన దాతలకు, జెడి పౌండేషన్ సభ్యులకు, చాంబర్ ఆఫ్ కామర్స్ శ్రీ కంభంపాటి సురేష్ గారికి, ఇతర వ్యాపారస్తులకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు శ్రీమతి హన్సి, శ్రీ అంబికా సురేష్, శ్రీ క డా లి నాగరాజు,గ్రీన్ భద్రాద్రి అధ్యక్షుడు శ్రీ భోగాల శ్రీనివాసరెడ్డి, బొలుసు సతీష్,కాంగ్రెస్ నాయకుడు శ్రీ సరేళ్ల నరేష్,సభ్యులు శ్రీ యూసుఫ్ మియా, రాంప్రసాద్ రెడ్డి, ముంతాజ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: