CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కోట్లు పెట్టి కట్టించారు శిధిలావస్థలో వదిలేశారు

Share it:

 


  • కోట్లు పెట్టి కట్టించారు శిధిలావస్థలో వదిలేశారు
  • నిరుపయోగంగా సాంఘిక సంక్షేమ భవనం.                               
  • ములుగు జిల్లా విద్యా వైద్య స్టాండింగ్ కమిటీ సభ్యులు నామ కరంచంద్ గాంధీ.

మన్యం టీవీ ఏటూరు నాగారం

మారుమూల గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు విద్యను అందించడం కోసం కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన భవనం నిర్భయంగా వదిలివేయడం తో శిథిలావస్థకు చేరుకుంది ప్రస్తుతం భవనంలో గబ్బిలాలకు నిలయంగా మారిందని ములుగు జిల్లా విద్య వైద్య స్టాండింగ్ కమిటీ సభ్యులు నామ కరంచంద్ గాంధీ అన్నారు.ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పక్కన నిర్మించి వదిలీపెట్టిన భవనమును సోమవారం ఆయన పరిశీలించారు.                                     ఒక కోటి 70 లక్షలు 2009 సంవత్సరంలో నిర్మాణం చేపట్టి నిరుపయోగంగా వదిలి వేయడంతో ఈట్టి భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది భవనంలో గబ్బిలాలకు నిలయంగా మారింది అని ములుగు జిల్లా విద్యా వైద్య జిల్లా స్టాండింగ్  కమిటీ సభ్యులు కరంచంద్ గాంధీ అన్నారు.ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదకొండేళ్ల క్రితం 70 లక్షలు ఖర్చుచేసి సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన భవనం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఎందుకు పనికి రాకుండా పోయిందని ఆయన అన్నారు.600 మంది విద్యార్థులకు వసతి సౌకర్యాలు అన్ని హంగులతో సౌకర్యంగా ఉంది చుట్టూ విశాలమైన క్రీడా మైదానం కూడా కలదు అన్నారు ఏటూరు నాగారం మండల కేంద్రానికి మంజూరైన సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల కొద్ది రోజులు జాకారం లో నిర్వహణ జరిగిందని అప్పట్లోనే ఇక్కడ భవనంలో విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని ఇక్కడ నిర్మాణం చేపట్టాలని విద్యార్థులు తల్లిదండ్రులు దళిత ప్రజాసంఘాల నాయకులు కోరడం జరిగిందని అన్నారు. అప్పటికి తాత్కాలికంగా మంగపేట మండలంలోని గoపోనీ గూడెం గ్రామంలో బీసీ హాస్టల్ ఎత్తివేయడంతో దాన్ని మరమ్మతులకు నిధులు కేటాయించి పనులు పూర్తిచేసి జాకారం గురుకులంలో నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలను సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల బాలుర పాఠశాలను మంగపేట కి తరలించారు.ప్రస్తుతం ఇక్కడ గురుకులంలో 482 మంది విద్యార్థులువిద్యనభ్యసిస్తున్నారని అన్నారు.విద్యార్థులకు ఇక్కడ సౌకర్యాలు లేకపోవడం సరిపడ తరగతి గదులు లేకపోవడంతో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది అన్నారు.ఉన్న విద్యార్థులకు తరగతి గదులు సరిపోకపోవడం ఇబ్బందిగా మారడంతో సాంఘిక సంక్షేమ శాఖ బాలుర గురుకుల పాఠశాలను ములుగు జిల్లా  మల్లం పల్లి గ్రామంలో కి అధికారులు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు.దళిత విద్యార్థులకు విద్యకు దూరం చేస్తున్నారు అని ఇప్పటికే చాలామంది డ్రాపవుట్లు గా ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.అన్ని వసతులు ఉన్న ఏటూర్ నాగారంను పక్కనపెట్టి ప్రైవేటు భవనము కి అద్దె చెల్లించి తరలించే ప్రయత్నాలు మానుకోవాలని అన్నారు.ఏటూర్ నాగారం లో సాంఘిక సంక్షేమ శాఖ బాలుర గురుకుల భవన నిర్మాణం చేపట్టడానికి స్థలం కేటాయించి ఏళ్లు గడుస్తున్నా నేటికీ ప్రభుత్వం భవన నిర్మాణం చేపట్టకపోవడం చూస్తే గ్రామీణ ప్రాంతంలో దళితుల మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తో చెలగాటం ఆడితే  ఊరుకునేది లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను ఏటూరు నాగారం లో నే నిర్వహణ చేపట్టాలని విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయకుండా  విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని ఔట్సోర్సింగ్ పార్ట్ టైం టీచింగ్ నాన్-టీచింగ్ ఉద్యోగాలు నాన్లోకల్ అనగా పట్టణ ప్రాంతాలకు చెందిన వారితో ఇలాంటి నోటిఫికేషన్ లేకుండా భర్తీ చేశారని,స్థానికులు ఉన్నత విద్య అభ్యసించిన వారు ఉన్నారని స్థానికులతో ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కన్నాయిగూడెం మండల కో ఆప్షన్ సభ్యులు అఫ్సర్,ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు వావిలాల స్వామి, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: