CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉ఆసుపత్రిల్లో లిక్విడ్ ఆక్సిజన్ సేవలు అందుబాటులోకిరావడం చాలా సంతోషమని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

Share it:

 


మన్యం టీవీ కొత్తగూడెం

సోమవారం సింగరేణి ప్రధాన వైద్య శాల నందు 38 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ జనరేటర్

ప్లాంటు ప్రారంభోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్లాంటును ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన

మాట్లాడుతూ కరోనా వ్యాధి రెండవ దశలో ప్రాణవాయువు అందక ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఆక్సిజన్ సేవలు అందుబాటులోకి

తేవాలని కోరడం జరిగిందని, ఆ విధంగా 20 రోజుల్లోనే టర్కీ నుండి కొనుగోలు చేయబడిన ఆధునాతన ఆక్సిజన్ ప్లాంటు

సింగరేణి ప్రధాన ఆసుపత్రి కార్యాలయంలో ఏర్పాటు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆక్సిజన్ ప్లాంటు గాలి

నుండి ఆక్సిజన్ తయారు చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ ఆక్సిజన్ ప్లాంటు సింగరేణి సంస్థలో పనిచేయుచున్న సిబ్బందితో

పాటు వారి కుటుంబ సభ్యులకు వైద్యసేవలు అందించేందుకు ఎంతో విలువైన ఉపయోగకరంగా పనిచేస్తుందని చెప్పారు. నెల రోజుల

క్రితం కోవిడ్ సోకిన వ్యక్తులకు ఆక్సిజన్ సేవలందించేందుకు బొట్టు బొట్టుకు ఎంతో శ్రమ పడాల్సి వచ్చిందని, నేడు ఆ పరిస్థితి

నుండి ఆక్సిజన్ ప్రజలకు వైద్య సేవలందించేందుకు ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు వల్ల

ఏ సమయంలోనైనా ఆక్సిజన్ సేవలు కొరత రాకుండా ప్రజలకు వైద్య సేవలందిస్తున్నామని చెప్పారు. నెల రోజుల క్రింత ఆక్సిజన్

సేవలు నిర్వహణలో జిల్లా యంత్రాంగంపై ఎంతో భారం పడిందని, కాని జిల్లా యంత్రాంగం తీసుకున్న పటిష్టమైన చర్యలు వల్ల.

ప్రజలకు ఆక్సిజన్ కొరత రాకుండా వైద్య సేవలందించామని చెప్పారు. సింగరేణి సంస్థ, జిల్లా యంత్రాంగం పరస్పరం సహకారంతో

జిల్లా ప్రజలకు విలువైన సేవలందిస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఇదివరకు కొత్తగూడెం, భద్రాచలంలో ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్లు

ఏర్పాటు చేశామని, నూతనంగా మరో మూడు ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. విపత్కర పరిస్థితుల్లో

ప్రాణాలను లెక్కచేయకుండా వైద్య సిబ్బంది వైద్యసేవలందించి ప్రజల ప్రాణాలను కాపాడారని వారి సేవలను ప్రత్యేకంగా

అభినందించారు. మున్ముందు వచ్చే ప్రమాదాన్ని సైతం ఎదుర్కొని ప్రజలకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలందించేందుకు జిల్లా

యంత్రాంగం సంసిద్ధంగా ఉన్నామన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించి జిల్లా ప్రజలకు వైద్య సేవలందిచాలని ఆయన వైద్య

సిబ్బందికి సూచించారు.

డైరెక్టర్ బలరాం మాట్లాడుతూ 750 లీటర్లు కెపాసిటి కలిగిన ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేసుకోవడం పట్ల హర్షం

వ్యక్తం చేశారు. సింగరేణి ప్రధాన ఆసుపత్రి ప్రాంగణంలో ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేయాలని కోరిన వెంటనే అనుమతులు

మంజూరు చేసిన సియండి శ్రీధర్కు ధన్యవాదాలు తెలిపారు. ఏక కాలంలో 90 బెడ్లుకు ఆక్సిజన్ సరఫరా చేసే సామర్ధ్యం ఉన్న

ప్లాంటు ఏర్పాటుతో ఆక్సిజన్ సమస్యను అధిగమించామని చెప్పారు. ప్రాణవాయువు అందక ఇబ్బంది పడుతున్న వారికి అక్సిజన్

ప్లాంటు సంజీవినిగా పనిచేస్తుందని చెప్పారు. కరోనా రెండవ దశలో ఆక్సిజన్ సేవలకు ఇబ్బంది ఏర్పండిదని ఆ పరిస్థితిని

సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని అటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఎదరైనా ప్రజలకు నిరంతరాయంగా ఆక్సిజన్ సేవలు అందించేందుకు

ఈ ప్లాంటు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. తక్కువ సమయంలో నిర్మాణం పూర్తి చేసి ఆక్సిజన్ సేవలు అందుబాటులోకి

తేవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సియంఓ శ్రీనివాసరావు, టిజిబికేఎస్ వైస్ ప్రెసిడెంట్ సోమురెడ్డి, ఉద్యోగుల సంఘ నాయకులు మూర్తి,

జియంలు ఆనందరావు, సుబ్బారావు, బసవయ్య, రమేష్, గణపతి, రమేషారావు, వైద్యాధికారులు, సిబ్బందిత తదితరులు పాల్గొన్నారు..

Share it:

TECHNOLOGY

TELANGANA

Post A Comment: