CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విజయభేరి మోగించిన పెంట్లం గ్రామ క్రికెట్ జట్టు

Share it:

 


 మన్యం మీడియా,అన్నపురెడ్డిపల్లి:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,చండ్రుగొండ మండలం,తిప్పనపల్లి గ్రామంలో ఆప్పీల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ది:31-01-2021 నుండి నిర్వహిస్తున్న చండ్రుగొండ,అన్నపురెడ్డిపల్లి మండలాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో,అన్నపురెడ్డిపల్లి మండలం,పెంట్లం గ్రామ పంచాయతీలోని (కేజీఎం)పెంట్లం క్రికెట్ జట్టు ప్రథమ బహుమతి కైవసం చేసుకొని,విజయభేరీ మోగించింది.ఈ క్రికెట్ టోర్నమెంట్లో మొత్తం 28 జట్లు పాల్గొన్నాయి.(కేజీఎం)పెంట్లం క్రికెట్ జట్టు,ప్రత్యర్థి జట్లులైన చండ్రుగొండ,అన్నపురెడ్డిపల్లి,రాజాపురం జట్లు మీద గెలుపొంది,సెమీఫైనల్లో (ఆర్ ఆర్ యూత్)తిప్పనపల్లి జట్టును ఓడించి,ఫైనల్ మ్యాచ్ ను అన్నపురెడ్డిపల్లి(అన్నదైవం)జట్టుతో తలపడి,క్రీడలలోని మెళుకువలను పాటిస్తూ,క్రీడా అభిమానుల హృదయాలలో ఉత్కంఠం రేపుతూ,ప్రధమ విజేతలుగా నిలిచి,ప్రథమ బహుమతి కప్ మరియు రూపాయలు 15,116/-నగదును మరియు బెస్ట్ బౌలర్ బహుమతిని గెలుచుకున్నారు.బెస్ట్ బౌలర్ గా మడకం సంపత్ కుమార్(కేజీఎం-పెంట్లం క్రికెట్ జట్టు),ద్వితీయ బహుమతి కప్ మరియు రూపాయలు 7,116/- నగదును,బెస్ట్ బ్యాట్స్ మెన్ బహుమతిని అన్నపురెడ్డిపల్లి (అన్నదైవం) జట్టు వారు దక్కించుకున్నారు.ఈ సందర్భంగా పెంట్లం గ్రామ పంచాయతీ సర్పంచ్ సవలం రాణి,ఉప సర్పంచ్ తాటి రామచందర్ రావు,ఎంపిటిసి బొగ్గం సీతామహాలక్ష్మి ,గ్రామ పెద్దలు కపిల లక్ష్మణ్ రావు,కపిల రావొజీ,భూపతి నరసింహారావు,కపిల శివప్రసాద్,సవలం ప్రకాష్,బత్తుల వెంకన్న,మడివి నాగేంద్రబాబు,గొంది సమ్మయ్య (విఆర్ఓ),క్రీడాకారులు,గ్రామ ప్రజలు విజయోత్సవ సంబరాలు జరుపుకొన్నారు.సబ్ ఇన్స్పెక్టర్ పి తిరుపతిరావు,గ్రామ పెద్దలు మాట్లాడుతూ,గ్రామ యువకులు క్రీడల పట్ల ఆసక్తి చూపుతూ,ప్రతిభ కనబరిచి, విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు మరియు జట్టును తమ సలహాలు,సూచనలతో ముందుకు నడిపిస్తూ,విజయానికి కృషిచేసిన కంచు రామకృష్ణ(ఫార్మసిస్ట్),సోయం రాంబాబు(ఎం.ఆర్.ఐ),బన్నే వెంకటేశ్వర్లు,పసుపులేటి కృష్ణ (పంచాయతీ కార్యదర్శి),సోయం రమేష్(ఏ.ఎస్ఐ) తదితరులకు అభినందనలు తెలియజేశారు.ఉత్కంఠభరితంగా సాగిన ఈ టోర్నమెంట్లో క్రీడాకారులు కుర్సం అర్జున్,కోట కిరణ్,తాటి శివ,బలరాం,సాగర్,భూపతి నాగరాజు,సవలం గోపి,కొర్సా సురేష్,గడ్డం శివ,కురం రాంబాబు తదితర క్రీడాకారులు ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: