CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఉండవల్లి సంచలనం

Share it:


రాజమండ్రి: 

మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి ప్రెస్‌మీట్‌.. 

1.నేను రాష్ట్రంలో ఉండే అన్ని గుళ్ల‌కు త‌ర‌చూ వెళుతుంటా.

ఆరుసార్లు అయ్య‌ప్ప‌మాల వేసుకొని.. రెండు సార్లు మాల మేయ‌కుండానే పంబ వెళ్లా.

2.ఈ రోజు (జ‌న‌వ‌రి 12)  స్వామి వివేకానందుడి పుట్టిన‌రోజు.

నేను అన్ని మ‌తాల‌ను గౌర‌విస్తా. చ‌ర్చి , మ‌సీదుల‌కు వెళ‌తాను` అని   వివేకానంద చెప్పాడు .ఇండియాకు వ‌చ్చి స‌హాయం చేయాల‌ని క్రిస్టియ‌న్ మిష‌నరీస్‌ను వివేకానందుడు.. అమెరికా వెళ్లిన స‌మ‌యంలో కోరారు.

మ‌తం అంటే న‌మ్మ‌కం. అన్ని మ‌తాల‌ను గౌరవించాలని వివేకానందుడు చెప్పాడు.

3.ఎవ‌రెవ‌రు ఏ దేవుడిని పూజించాలో.. ఆ దేవుడిపై భ‌క్తి క‌లిగించేది నేన`  అని కృష్ణుడు భ‌గ‌వ‌ద్గీత‌లో చెప్పాడు.

4.హిందువుల్లో అగ్ర‌కులాల వారు.. వెన‌క‌బ‌డిన కులాల‌ను చిన్న‌చూపు చూడ‌టం వ‌ల్లే.. వారు క్రిస్టియానిటీవైపు వెళ్లారు. ఇప్పుడు స‌మాజంలో చాలా మార్పులు వ‌చ్చాయి. మ‌త మార్పిడులు జ‌ర‌గ‌డం లేదు.

5.నిజం చెప్పేవాడే బ్రాహ్మ‌ణుడు. క‌ర్మ‌ను బ‌ట్టి వ‌ర్ణం  ( బ్రాహ్మ‌ణ‌, వైశ్య‌, శూద్ర‌, క్ష‌త్రియ‌). అంతే కానీ..  జ‌న్మ‌ను బ‌ట్టి కాదు.

6.వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి వాళ్ల తాత క్రిస్టియానిటీ తీసుకున్నారు. కానీ.. ఆయ‌న హిందూ దేవాల‌యాల‌కు వెళ‌తారు. అక్క‌డ పూజారులు చెప్పిన ప్ర‌కారం పూజ‌లు చేస్తారు.

7.జగన్ బాబాయ్ అయిన  టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి  నన్ను  మించిన హిందువు . ఆయ‌న భార్య‌.. గోమాత‌కు పూజ చేసి కానీ... రోజువారీ కార్య‌క్ర‌మాలు ప్రారంభించ‌దు.

వాళ్ల సిస్ట‌ర్ విజ‌య‌మ్మ బైబిల్ చ‌దువుతారు.

అదే వారి కుటుంబంలో గొప్ప‌ద‌నం.

8.హిందుత్వ అనే పుస్త‌కం రాసిన  వీర్ సావ‌ర్కర్‌కు దేవుడంటే న‌మ్మ‌కం లేదు.

9.మ‌హ‌మ్మ‌ద్ అలీ జిన్నా పూర్వికులు హిందువులు. వాళ్ల తాత పేరు ప్రేమ్‌జీ భాయ్‌ ఠక్కర్‌ ఓ రాజ్‌పుట్, వాళ్ళు  అంతా  శాకాహారులు

అయితే  టక్కర్  చేప‌ల వ్యాపారం చేసేవారు. అందుకే.. ఆయ‌న్ని ఆ కులం నుంచి వెలేశారు.  తరువాత అయన మనో వేదనతో  మ‌ర‌ణించారు.

ఆ కోపంతో.. జిన్నా వాళ్ల నాన్న ఇస్లాం స్వీక‌రించారు.

( మ‌న‌ల్ని మ‌తం నుంచి వెలేసిన‌ప్పుడు.. వేరే మ‌తంలోకి చేర‌డం చాలా కామ‌న్‌)

10.ప్రపంచంలో ఎక్కువ మంది ఆచ‌రించేది క్రిస్టియానిటీ. త‌రువాత ఇస్లాంను అనుస‌రిస్తారు. `

త‌న‌ను తాను తగ్గించుకున్న‌వాడు.. హెచ్చించ‌బ‌డును.. త‌న‌ను తాను హెచ్చించుకున్నవాడు.. త‌గ్గించ‌బ‌డును` అని జీసస్ క్రిస్ట్ చెప్పారు

11.రైల్లో గొడ్డు మాంసం ర‌వాణా చేస్తున్నార‌ని మొన్నామ‌ధ్య కొంత మందిని చంపేశారు. బీఫ్ ఎగుమ‌తుల్లో మ‌న‌దేశం మూడో స్థానంలో ఉంది. బీఫ్ ఎగుమ‌తుల‌ను అరిక‌ట్ట‌కుండా ఆరేళ్లుగా మోడీ ఏం చేస్తున్నాడు?

12.ప్ర‌తి  సీఎం మ‌ళ్లీ అధికారంలోకి రావాల‌నుకుంటాడు కాబ‌ట్టి.. మ‌త మార్పిడులు.. మ‌త క‌ల‌హాల‌ను   ప్రోత్స‌హించ‌డు. ఆల‌యాల‌పై దాడులు స‌హించ‌డు.

13.జగన్ ఎలాంటి మత మార్పిడులు చేయడం లేదు

మతం ఎవరూ ఊరికే  మారరు కాబట్టి మత మార్పిడులు అనేది తప్పు

14.సీఎం, హోం మినిస్ట‌ర్‌, డీజీపీలు క్రిస్టియ‌న్లు అన‌డం చంద్ర‌బాబు తప్పు.

15.తిరుపతి ఎన్నికల కోసం ..

భ‌గ‌వ‌ద్గీత కు ‌, బైబిల్‌కు , కృష్ణుడికి జీసస్ కు  పోటీ అని బీజేపీ ప్రచారం చేస్తోంది. ఇది చాలా త‌ప్పు.

ఎవ‌రో.. ఆల‌యాల‌పై దాడులు చేస్తుంటే.. రాజ‌కీయాల కోసం బీజేపీ  పాకులాడుతోంది.

Share it:

Post A Comment: