CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతన్నకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

Share it:

 ప్రభుత్వ విప్ రేగా కాంతారావు 


ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని జానంపేట, గ్రామాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రైతు వేదికలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్  పినపాక శాసనసభ్యులు  రేగా కాంతారావు ప్రారంభించారు.  ఈ సందర్భంగా రేగా  మాట్లాడుతూ రైతు సమన్వయ సమితి సభ్యులు అందరూ ఒకచోట చేరి రైతులకు అందించాల్సిన సేవల గురించి చర్చించేందుకు రైతు వేదికలు ఉపయోగపడతాయన్నారు. సుమారు 300 మంది రైతులు సమావేశం జరుపుకునే విధంగా రైతు వేదికల నిర్మాణం జరిగిందన్నారు. పలు అంశాలపై క్షుణ్ణంగా చర్చించేందుకు, వ్యవసాయ అధికారుల ద్వారా సీజన్ బట్టి పలు సలహాలు సూచనలు తీసుకొని లాభసాటి పంటలపై దృష్టి సారించేందుకు ఇవి ఉపయోగ పడతాయన వారు అన్నారు, రైతును రాజుగా చూడాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ గారు రైతుల కోసం పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అందులో 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా, దేశానికే ఆదర్శమని వారు పేర్కొన్నారు. 5 వేల ఎకరాలకు ఒక ఏఈవో ఉన్నారు. ఏఈవో క్లస్టర్ల పరిధిలో రెండు, మూడు గ్రామాలకు కలిపి అందరికీ అందుబాటులో ఉండేలా గ్రామంలో రైతు వేదికలను నిర్మించారని అన్నారు. ఇక్కడ మైకు, కుర్చీలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. అవసరాలకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలు, పంట ఉత్పత్తులు నిల్వ ఉండేలా దీన్ని నిర్మించ అన్నారు. క్లస్టర్‌ పరిధిలోని గ్రామాల రైతుల సమావేశాలు, శిక్షణ, పథకాలపై అవగాహన.. ఇలా రైతులకు చెందిన అన్ని కార్యక్రమాలు అక్కడే నిర్వహించుకునేలా ఏర్పాట్లుచేస్తారు. ఇప్పటివరకు మండలస్థాయిలోనూ ఇలాంటి సమావేశ మందిరాలు లేవు. మండలాల్లో పూర్తిస్థాయి కార్యాలయాలు లేని వ్యవసాయాధికారులకు సైతం ఈ వేదికలు ఉపయోగపడనున్నాయి. ఈ కార్యక్రమంలో పినపాక మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక రైతులు, పలు శాఖల ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: