CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బాలల హక్కుల రక్షణకై బాలల హక్కుల ప్రజా ధ్వని రాష్ట్ర కమిటీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించడమైనది.

Share it:

 



మన్యం టీవీ కొత్తగూడెం


 బాలల హక్కుల ప్రజాధ్వని రాష్ట్ర అధ్యక్షుడు వై లక్ష్మణరావు


 సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బాలల హక్కుల ప్రజా ధ్వని రాష్ట్ర కమిటీ సభ్యులు  సుజాతనగర్ మండలం లోని రాఘవపురం, చుంచుపల్లి మండలంలోని పెనుబల్లి, అదే విధంగా కొత్తగూడెం మండలంలోని గౌండ్లరామవరం గ్రామాల్లో పిల్లల హక్కుల పరిరక్షణ గురించి ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలను విద్యార్థులను పిల్లలను చైతన్యం చేయడం జరిగింది.

 పాఠశాలలోని మౌలిక వసతులను అదేవిధంగా అంగన్వాడి లోని మౌలిక వసతులను పరిశీలించి ఈ కార్యక్రమంలో బాలల రక్షణ కమీటిలతో చర్చించి ఆయా గ్రామాల్లోని పిల్లలు ఎదుర్కొంటున్నా సమస్యలు, పౌష్టికాహారం లోపం, బాలికలకు రక్షణ లేకపొవాడం తదితర అంశాలను గుర్తించడం జరిగింది,

 పాఠశాలల్లో మౌలిక వసతులు లేకపోవడం కరోనా కారణంగా పాఠశాలలు మూసివేయడంతో పేద పిల్లలు అనేక ఇబ్బందులకు గురయ్యారు అదేవిధంగా ఆన్లైన్ క్లాసులు పెట్టడం ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్లు  లేకపోవడం ద్వారా పేద పిల్లలు అనేక ఇబ్బందులకు గురైన విషయాలను మా దృష్టికి తీసుకువచ్చారు.

 అదే విధముగా పాఠశాలలకు మరియు కళాశాలకు వెళ్లి వస్తుంటే రోడ్ల వెంబడి కొంతమంది అల్లరిమూక  మమ్ములను ఇబ్బందికి గురి చేస్తున్నారని వారి దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు

 బాలల హక్కుల ప్రజాధ్వని రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వై లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రంలో బాలల హక్కుల ఉల్లంఘన యేదెచగా స్వేచ్ఛగా జరుగుతుందని దాన్ని రక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని అట్టి విషయాలను పోలీసుల దృష్టికి మరియు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకురావడానికి ముందుకు రావాలని గ్రామస్తులకు విద్యార్థులకు సూచించారు.

 అదే విధముగా ఎస్ఎంసి కమిటీలు ఎప్పటికప్పుడు బలోపేతం కావాలని కమిటీల ద్వారా పాఠశాలలో ఉన్న మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్కరి బాధ్యతగా వహించి ఈ కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.

 ఈ కార్యక్రమంలో బాలల హక్కుల ప్రజాధ్వని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి కేడం కృప వేణి, జిల్లా అధ్యక్షుడు ఉండెటి రాంబాబు, డాక్టర్ మాట్ల గాయత్రీ, నక్క సృజన, రాష్ట్ర కమిటీ సభ్యులు జెర్ర ప్రతాప్, పి వి సి ఆర్ రాష్ట్ర కోఆర్డినేటర్ కంచు కట్ల సుభాష్ మరియు పి వి సి ఆర్ రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్ము తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: