CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉 పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలి.

Share it:


* కొనుగోలు కేంద్రాల్లో రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి.

* ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు పరచక పోతే ఎలా?

* తక్షణమే సమస్యలను పరిష్కరించాలి- ఆళ్లపల్లి ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి


గుండాల మన్యం టీవీ: ఆళ్లపల్లి, గుండాల మండలాల్లో సాగు చేసుకుంటున్న  రైతులకు పట్టాలు ఇవ్వాలని, రైతులు పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేయాలని అధికారులు నిర్లక్ష్యం వీడి తక్షణమే సమస్యలకు పరిష్కారం చూపాలని ఆల్లపల్లి ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్తు సమావేశంలో గుండాల, ఆళ్లపల్లి మండల సమస్యలపై ద్వజమెత్తారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ధాన్యాన్ని కొనుగోలు చేయలేదని ప్రశ్నించారు. మిల్లర్లు ఇబ్బంది పడుతున్నారని సాకుతో కేవలం సన్న వడ్లు మాత్రమే కొనుగోలు చేసే విధంగా వ్యవసాయ అధికారులు వ్యవహరిస్తున్నారని వాపోయారు. నిబంధనల ప్రకారం ప్రతి రైతు పండించిన పంటను కొనుగోలు చేయాలని తెలపగా వ్యవసాయ శాఖ ఏడి స్పందిస్తూ  మరుసటి రోజే విచారణ చేసి రైతులకు న్యాయం చేస్తామని అన్నారని తెలిపారు. ఇందిర జల ప్రభ , గిరి వికాసం  పథకంలో జిల్లా అంతాట నిధులు మంజూరు అయిన  ఆళ్లపల్లి  మండలంలోని పెద్ద వెంకటాపురంలో 23 బోర్లు 

ఇప్పనపల్లిలో బోర్లు  నిలిచిపోయిన పనులకు బడ్జెట్  మంజూరీ కాకపోవడం పట్ల అధికారులను నిలదీశారు. 

 గిరివికాసం జియోలాజిస్ట్ సర్వే  నిర్వహించి లబ్ధిదారులకు 

న్యాయం చేయాలని కోరారు.

అటవీశాఖ ROFR పట్టాలు ఉండి చనిపోయిన రైతులకు రైతు బందు నిలిచిపోయిన అందున పరిష్కారం చూపించ వలసినదిగా PO గారిని కోరగా చనిపోయిన రైతుల పట్టాలను కుటుంబ సభ్యులకు మారుస్తాం అని ఐటిడిఎ పిఓ హామీ ఇచ్చారని తెలిపారు. 

అనంతోగు పంచాయతీ ,   రాయపాడు గ్రామపంచాయతీ, మర్కొడూ పంచాయతీ  పరిధిలో గ్రామసభల  తీర్మానం 

 లేకుండా భూములకు కందకాలు తవ్వకూడదు అని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా పెండింగ్లో ఉన్న 123 మంది పోడు రైతుల సమస్యలను పరిశీలించాలని తెలిపారు. సబ్- స్టేషన్  పనులకు అటవీ శాఖ వారు అత్యుస్తహం ప్రదర్శిస్తున్నారు అని  అభివృధి పనులకు అంతరాయం కలిగిస్తున్నారని జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేశారు.  విన్నవించిన  సమస్యలపై మరో రెండు రోజుల్లో ఆళ్లపల్లి, గుండాల మండలాల్లో  విచారణ చేసి చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు తెలిపారని అన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: