CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గిరిజన బిడ్డలు వృద్ధిలోకి రావాలంటే విద్య ఒక్కటే మార్గం

Share it:

 


*గిరిజనులు వెలుగు నింపడమే కేసీఆర్ లక్ష్యం

*గిరిజన గుండెలలో  221 కోట్లతో త్రి ఫేస్ కరెంట్

 *స్థానిక నియోజకవర్గానికి గోదావరి నీరు సాగులోకి తీసుకువస్తాం 

*గోదావరికి కరకట్ట మంజూరు *గిరిజన యువత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.


మన్యంటీవీ  ఏటూరునాగారం:


 విద్య ద్వారానే వికాసం ఉంటుందని, గిరిజన

 విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలనే లక్ష్యంతో నిర్మిస్తున్న పోస్ట్ మెట్రిక్ హాస్టల్ భవనాలలో భాగంగా  1.30 కోట్ల  రూపాయలతో ములుగు జిల్లా, ఏటూరు నాగారం ఐటీడీఏ లో నిర్మించిన భవనాన్ని, గిరిజన మహిళల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా స్వయం ఉపాధి కల్పించడంలో భాగంగా 40 లక్షల రూపాయల తో నిర్మించిన డ్రై మిక్స్ ప్లాంట్ ని ప్రారంభించి, 4.90  కోట్ల రూపాయల విలువైన ఆస్తుల( 54 క్యారియర్ వాహనాలు) ను పంపిణీ చేసిన  రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి  సత్యవతి రాథోడ్, ఎంపి కవిత , ఎమ్మేల్యే  సీతక్క , జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్.

సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ

ఈరోజు దాదాపు 8.60 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ఏటూరు నాగారం లో ప్రారంభించుకున్నాము.

ఏటూరు నాగారం అంటే వెనుకబడిన ప్రాంతం, సరైనా వసతులు లేవన్న అభిప్రాయం మార్చే విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నాము.

ఈ రాష్ట్రంలో వెనుకబడిన గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం కేసిఆర్ గారు అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.

స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ వచ్చే వరకు ఎన్ని గురుకులాలు ఉన్నాయో... కేసిఆర్ గారు సీఎం అయ్యాక ఎక్కువ గురుకులాలు తెచ్చారని గర్వంగా చెబుతున్నాను.

కేజీ నుంచి పీజీ వరకు అన్ని రకాల విద్య, కోచింగ్ ఇస్తూ, ఇక్కడ లేని విద్య విదేశాల్లో చదువుకునేందుకు 20 లక్షల రూపాయలు ఇస్తున్నారు.

గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు పోషకాహారాన్ని అందిస్తూ గిరిజన బిడ్డల సమగ్ర అభివృద్ధికి పాటుపడుతున్న సీఎం కేసిఆర్ గారు.

కిరాయి కి వాహనాలు నడుపుతూ ఇబ్బందులు పడుతున్న గిరిజన యువత కష్టాలు తీరే విధంగా డ్రైవర్ కం ఓనర్ పథకాన్ని తెచ్చి వాహనాలు ఇస్తున్నాము.

అదే విధంగా గిరిజనులను పారిశ్రామిక వేత్తలు చేసేలా సీఎం ఎంటర్ప్రెన్యుర్ షిప్ పథకం కింద 50 లక్షల వరకు సబ్సిడీ ఇస్తూ ప్రోత్సహిస్తుంది.

ఈరోజు ఇచ్చిన వాహనాలను కూడా సద్వినియోగం చేసుకొని ఆర్దికంగా అభివృద్ధి చెందలని కోరుతున్నాను .

గిరిజన ప్రాంతాలలో అన్నిటిలో వచ్చే ఏడాదికి త్రీ ఫేజ్ కరెంట్ లేని గిరిజన గుడెలు  గిరిజన తండాలు లేకుండా చేస్తామని సీఎం కేసిఆర్ గారు హామీ ఇచ్చారు. ఇందుకోసం ఇప్పటికే 117 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. మిగిలిన నిధులు ఎన్ని కావాలో చెప్పమని కూడా అడిగారు.

అని అన్నారు.

రైతు వేదికలు అంటే రైతుల ఆత్మ గౌరవానికి ప్రతీకలు.

ఈ జిల్లాలో 31 రైతు వేదికలు పూర్తి చేసుకున్నాం.

గోదావరి నది నీళ్ళు ప్రతి ఎకరాకు అందేలా నిన్ననే సీఎం కేసిఆర్ గారు సమీక్ష చేశారు.

ఏయే కాలువలు, ప్రాజెక్టులు కట్టడం వల్ల ఒక్క ఎకరా మిగలకుండా సాగు నీరు అందించేలా కృషి చేస్తున్నామని అన్నారు.

రామప్పను బ్యాలెన్స్ రిజర్వాయర్ చేసుకోవడం ద్వారా లక్నవరం చెరువులోకి నీరు నింపి ఆ ప్రాంతమంతా సాగు అయ్యేలా ప్రయత్నం చేస్తున్నాం.

గిరిజనుల సమగ్ర అభివృద్ధికి అందరం కుటుంబ సభ్యుల వలె కలిసి పని చేస్తామని హామీ ఇస్తున్నాను. మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.

సమావేశంలో ఎంపి శ్రీమతి మాలొతు కవిత మాట్లాడుతూ

ఇచ్చిన వాహనాలు మీరే  తూ నడుపుకొండి, తాగి నడుపొద్దు, లైసెన్స్ లేకుండా నడుపొద్దు.

ఆదివాసీ గుట్టల పై కూడా స్తంభాలు వేసి త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వాలని సీఎం కేసిఆర్ గారు 270 కోట్ల రూపాయలు మంజూరు చేశారు అన్నారు.

ములుగు ఎమ్మెల్యే శ్రీమతి సీతక్క మాట్లాడుతూ

ఇచ్చిన ఆస్తులను, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.

ఐటీడీఏ పథకాల గురించి లబ్ధిదారులకు ప్రచారం చేసి, వాటిని వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని అధికారులను కోరుతున్నాను.

కుటీర పరిశ్రమలను మరింత ప్రోత్సహించి ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలి.

ములుగు  జిల్లాలలో  అన్ని గ్రామాలకు త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వాలని ఈ సభాముఖంగా మంత్రిగారిని కోరుతున్నాను.

ఫారెస్ట్ అధికారులతో ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి చాలా అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయి. 

అడవులను కాపాడడం ముఖ్యమే కానీ అడవిపై ఆధారపడే వారికి తగిన వసతులు కల్పించేలా మంత్రి గారు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని అన్నారు.

వచ్చిన వాహనాలను అమ్ముకోకుండా స్వయంగా నడుపుకొని బాగుపడాలి అని లబ్ధిదారులను సూచించారు.

ములుగు జిల్లా జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మాట్లాడుతూ

కొట్లాడి సాధించిన తెలంగాణలో గొప్ప సంక్షేమ పాలన సాగుతోంది. అందులో ఏజెన్సీలో గిరిజన సంక్షేమ శాఖ కీలక పాత్ర పోషిస్తుంది.

రవాణా వాహనాల సదుపాయం కింద నేడు చాలా మంది లబ్ధిదారులకు వాహనాలు ఇవ్వడం సంతోషం గా ఉందన్నారు.

మనసున్న మహారాజు సీఎం కేసిఆర్ గారు.ఆయన తీసుకొచ్చే పథకాల ద్వారా లబ్ది పొందాలని, ఆయనకు అండగా నిలబడాలని విజ్ఞప్తి.

ములుగు జిల్లాలో గిరిజన యువతను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు చేసేలా ఇక్కడ ఒక పరిశ్రమల క్లస్టర్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం.

రానున్న కొత్త సంవత్సరంలో ఆర్దికంగా మీరు ఎదగాలని ఆకాంక్షిస్తూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.మీకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు అని జగదీష్ అన్నారు.

 ఈ కార్యక్రమంలో  గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ శ్రీమతి క్రిస్టినా జెడ్ చొంగ్తు, కలెక్టర్  కృష్ణ ఆదిత్య, ఏటూరు నాగారం ఐటీడీఏ పీవో హన్మంతు కె జండగే,ఏఎస్పీ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి, ఏపీవో వసంతరావు, డిటిడివో  మంకిడి ఎర్రయ్య, ఏవో రఘు, మేనేజర్ లాల్, జిసిసి డిఎం ప్రతాప్ రెడ్డి, జిసిసి మేనేజర్ దేవ్,ఏటూరునాగారం తాసిల్దార్ కుసుమ రవీందర్ రైతు బందు జిల్లా సమన్వయ కర్త పల్లా బుచ్చయ్య,  జడ్పి కోఆప్షన్ మెంబర్ వాలీయాభీ సలీం, కన్నాయిగూడెం మండల జడ్పిటిసి నామకరణం చందు గాంధీ, ఏటూరునాగారం ఎంపీపీ అంతటి విజయ నాగరాజు, ఎంపీటీసీ గుడ్ల శ్రీలత దేవేందర్, స్థానిక సర్పంచ్ ఈసం రామ్మూర్తి  ఏటూరునాగారం సీఐ కిరణ్ కుమార్, స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి  అధికారులు  తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: