CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దేవి....నేటి సీత

Share it:

 


👉వయసు 25 సంవత్సరాలు

 👉 ముగ్గురు ఆడపిల్లల కి తల్లి

👉గత సంవత్సరం భర్త మృతి

👉ఉన్న ఇంటి స్థలాన్ని అమ్ముకున్న అత్తమామలు

👉దిక్కుతోచని స్థితిలో దేవి

ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని వేడుకోలు

మన్యం టీవి, పినపాక:20 సంవత్సరాల వయస్సు లో పెళ్లి...అనంతరం ఇద్దరు ఆడ కవలలకు  తల్లి...భర్త చనిపోయే నాటికి మూడు నెలల గర్భవతి... మూడో సంతానం మళ్ళీ ఆడ పిల్ల పుట్టింది.కనీసం ఉండడానికి సెంటు స్థలం లేని కడు దారిద్ర్య పేదరికం ఆమెది.ఇది గోపాలరావు పేట గ్రామానికి చెందిన కంబాపూరి దేవి దీన గాధ. ఈ నేటి సీత పై మన్యం టీవి కథనం.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తోగూడెం పంచాయతీ గోపాలరావుపేట గ్రామానికి చెందిన కాంబపూరి దేవి ని మణుగూరు మండలం దమ్మక్క పేటకు చెందిన కాంబపూరి సత్యనారాయణ కు ఇచ్చి వివాహం జరిపించారు.అపొసప్పో చేసి దేవి అమ్మానాన్నలు నర్రా వెంకన్న,సోమక్కలు లాంఛనాలు ముట్టజెప్పి వివాహం జరిపించారు. విధి ఆడిన వింత నాటకంలో దేవి భర్త సత్యనారాయణ మృతి చెందారు. అప్పటికే కడు ధీనస్థితిలో ఉన్న దేవి కుటుంబ భర్త మృతి తో ఆమె పరిస్థితి దారుణంగా తయారైనది. భర్త అకాల మరణం,చిన్న తనం లోనే ముగ్గురు ఆడపిల్లల సంతానం వెరసి ఆమెకు కుటుంబ భారంపెను భారంగా మారింది.ఇది ఇలా ఉండగా భర్త చనిపోయిన బాధ లో పుట్టెడు దుఃఖం లో ఉన్న దేవి ని ఆదరించాలిసిన అత్తమామలు ఉన్న ఒక్క ఆధారం ఐన ఇంటి స్థలంలో కొంత భాగాన్ని అమ్మేశారు.తన గోడు ఎవరికి చెప్పాలో తెలియ దయా నియ స్థితిలో ఉంది ఆమె.దేవి ప్రస్తుతం గోపాలరావు పేట లో అమ్మ నాన్నల వద్ద ఉంటుంది. తన ఇంటి స్థలాన్ని తనకు ఇప్పించి తన ముగ్గురు పిల్లలకు ఆదుకోవాలని, అలాగే కడు నిరుపేదను ఐన తను స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం, దాయర్థ హృదయులు ఆదుకోవాలి ఆమె వేడుకుంటుంది.దేవి కి చిన్న వయసులో వచ్చిన కష్టాలను చూసి నాడు పురాణం లో సీత దేవి ఎన్ని కష్టాలు పడిందో దేవి ప్రస్తుతం అవే కష్టాలు ఎదుర్కొంటునదని గ్రామస్థులు తెలిపారు. సహాయం చెయ్యాల్సిన దాతలు మన్యం టీవి 9581905907,9160647647,లేదా దేవి నెంబర్ 7732086015 సంప్రదించగలరు.

Share it:

TELANGANA

Post A Comment: