CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పినపాక భగీరథతుడు విప్ రేగా చొరవ...

Share it:


 

👉నేటికి నిండు కుండలా తోగూడెం చీమల చెరువు

👉100 ఎక్కరాల్లో రెండో పంట సాగుకు సరిపడా నీరు

👉విప్ రేగా కాంతారావు గ్రామస్తులు కృతజ్ఞతలు

మన్యం టీవి,పినపాక:పినపాక భగీరథుడు గా పేరు గాంచిన విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చొరవతో భద్రద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తోగూడెం కి చెందిన చీమల చెరువు నేటికి నిండు కుండలా ఉంది.గత ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం మూలంగా ఒక్క పంట కు ఆ చెరువు లో నీరు నిల్వ ఉండడం గగనం. అలాంటిది ప్రస్తుత చీమల చెరువును చూస్తే ఔరా అనక తప్పదు.ఈ సంవత్సరం అధిక వర్షాలు నమోదైన విషయం విధితమే. ఆ సమయంలో వరదనీరు చీమల చెరువుకు భారీగా చేరడం కట్ట తెగే పరిస్థితి నెలకొంది.ఈ నేపథ్యంలో తోగూడెం గ్రామానికి చిందిన రైతులు, యువకుడు బండ మనోజ్ కుమార్ రెడ్డి లు కట్ట పరిస్థితి ని విప్ రేగా కాంతారావు దృష్టి కి తీసుక వెళ్ళడం తో తక్షణమే స్పందించారు. కట్ట మరమ్మతులు చేయించారు. రేగా నిర్ణయం తో నేడు చీమల చెరువు కింద 100 ఎకరాల్లో రైతులు రెండో పంట సాగు కు సిద్ధమయ్యారు.ఈ సందర్భంగా విప్ రేగా చొరవ పట్ల రైతులు హర్షం వ్యక్తం చెయ్యడం తో పాటు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: