CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మిల్క్ బ్యూటీ తమన్నా ముద్దుమాటలు

Share it:


.... 

    త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లు దాటింది. టీనేజ్‌లోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తమన్నా ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది. తన డ్యాన్సులతో పాటు, తగినన్ని అంద చందాలను కూడా వీలున్నప్పుడల్లా ఆర బోస్తూ తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతోంది త‌మ‌న్నా. అయితే ప్రస్తుతం తమన్నాకు హీరోయిన్‌గా అవకాశాలు తగ్గాయనే చెప్పోచ్చు. ఈ భామ ప్రస్తుతం గోపిచంద్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'సీటీమార్' చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోంది. ఇక నితిన్ సినిమాలో కొంత బోల్డ్’గా నటిస్తోంది. నితిన్ హిందీ సూపర్ హిట్ సినిమా అంధాధున్‌ తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. నితిన్‌కు జోడిగా నభా నటేష్ నటిస్తోంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ పాత్ర కాదు. కొంత విలనీగా ఉంటూ హీరోకు సమానంగా ఉంటుంది. ఇదే పాత్రను హిందీలో టబు చేసింది. ఇక అది అలా ఉంటే తమన్నా ఇటీవల ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. శారీరక రంగును అనుసరించి వ్యక్తులకు ముద్దు పేర్లు పెట్టి పిలవడం తనకు నచ్చదని అంటోంది తమన్నా. అభిమానులంతా తమన్నాను మిల్కీబ్యూటీ అని పిలుస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆ పిలుపు తనకు సంతోషాన్ని ఇవ్వదని చెబుతోంది తమన్నా.


శరీర వర్ణాన్ని బట్టి పేర్లు పెట్టడం తప్పు. మనదేశంలో తెలుపు రంగు చర్మం పట్ల అభిమానం,వ్యామోహం చాలా మందిలో కనిపిస్తోంది. కొన్నిసార్లు ఇలాంటి పేర్లు, ముద్రలు ఆత్మన్యూనతకు కారణమవుతాయి. మన టాలెంట్‌ను బట్టి ముద్దు పేర్లు పెడితే బాగుంటుంది. కానీ చర్మ రంగును బట్టి ముద్దుపేర్లు వద్దని తెలిపింది. ఇంకా ఆమె మాట్లాడుతూ.. ఒకప్పుడు వెబ్‌సిరీస్‌ల పట్ల టాప్ హీరోయిన్స్‌లలో చిన్నచూపు ఉండేది. అయితే కరోనా కారణంగా ఏర్పడ్డ ప్రత్యేక పరిస్థితల వల్ల గత కొంతకాలంగా ఈ ధోరణిలో మార్పులు వస్తున్నాయని తెలిపింది. తమన్న ప్రస్తుతం 'లెవెంత్‌ అవర్‌' పేరుతో తమన్నా ఓ వెబ్‌సిరీస్‌ చేస్తోంది. ఇక ఇటీవల కరోనా బారిన పడిన తమన్నా.. కరోనాకు చికిత్స పొంది సురక్షితంగా బయటపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొంత విశ్రాంతి అనంతరం తిరిగి షూటింగులతో బిజీ అయిపోయింది. తమన్నా తెలుగులో గుర్తుందా శీతాకాలంలో నటిస్తోంది. ఈ సినిమా ఓ కన్నడ సినిమాకు రీమేక్‌గా వస్తోంది. సత్యదేవ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. తమన్నా ఓ హిందీ సినిమాలోను నటిస్తోంది. బోలే చుడియన్ పేరుతో వస్తోన్న ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీతో నటిస్తోంది తమన్నా. ఇక ఆమె నటించిన దటీజ్ మహాలక్ష్మి ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమా కంగనా రనౌత్ హిందీ సూపర్ హిట్ క్విన్‌కు రీమేక్ వస్తోంది. 

..

Share it:

CINEMA

SLIDER

Post A Comment: