CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రెవిన్యూ కనుసన్నల్లో భూ కబ్జాలు- తుడుం దెబ్బ

Share it:



మన్యం టీవీ మంగపేట. 

మంగపేట మండలకేంద్రంలో భూముల కబ్జా యధేచ్చగా జరుగుతున్నది లక్షల రూపాయల విలువచేసే ప్రభుత్వ భూములను రెవిన్యూ అధికారుల అండదండల తో ఆదివారాల్లో  ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని వీటిని అరికట్టాలని తుడుందెబ్బ ములుగు ప్రధాన కార్యదర్శి కాపుల సమ్మయ్య ఒక ప్రకటనలో తెలియజేసారు. 

మండల కేంద్రంలో లక్షల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నా  రెవిన్యూ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు ఉండటం శోచనీయమని, పక్కనే ఉన్న పల్లె ప్రకృతి వనాలకు  కేటాయించబడిన భూములను  సైతం ప్రైవేట్ వ్యక్తులు కబళించి వేస్తుంటే స్పందిచక పోవటం అదికూడా ప్రభుత్వ సెలవుదినాలలో జరుగుతుంటే రెవిన్యూ, పంచాయతీ అధికారులు సిబ్బంది ఏమి తెలియనట్లు, ఏమీజరగనట్లు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది అని అన్నారు. గతంలోకూడా ఇటువంటి సంఘటనజరిగింది, ఆర్టిసి బస్టాండ్ ఎదురుగా గల ప్రభుత్వభూమి కబ్జా కు గురైనది కూడా ప్రభుత్వ సెలవు దినాలలోనే ఆక్రమించుకున్నారని దీనికి రెవిన్యూ అధికారులు స్పందించి ఉంటే మరల ఇటువంటి సంఘటన పునరావృతం అయ్యేదికాదని ఇప్పుడు అక్కడ ఒక బిల్డింగ్ కూడా ఏర్పాటు అయిందని తెలియజేసారు. మల్లూరు గుట్టకు వెళ్లే దారిలో కూడా ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని బిల్డింగ్ నిర్మించుకుని కిరాణా షాప్ లు నడుపుతున్న కూడా ప్రభుత్వ అధికారులు స్పందించకపోవటం మరి దారుణమని, ఇకనైనా రెవిన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు స్పందించి అక్రమ కట్టడాలను, భూ కబ్జాలను అడ్డుకోవాలని లేనిచో కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ఈ విషయం పిర్యాదు చేస్తామని ఈసందర్బంగా తెలియజేసారు.

Share it:

TELANGANA

Post A Comment: