CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మొక్కల పెంపకానికి ప్రణాళిక సిద్ధం చేయాలి : జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య

Share it:


 మన్యంటీవీ  ఏటూరునాగారం:


జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియం హాల్ లో గురువారం హరితహారం పై రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో భాగంగా ఈ సంవత్సరానికి మొక్కల పెంపకానికి గత సంవత్సరం టార్గెట్ కంటే పది శాతం అదనంగా మొక్కలను పెంచుటకు ప్లాన్ చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. హరిత హారంలో ఏవెన్యు ప్లాంటేషన్, బాండ్ ప్లాంటేషన్స్,  హోమ్ స్టేట్, పండ్ల మొక్కలను పెంచుటకు ముందే ప్లాన్ చేసి ప్రజల డిమాండ్ మేరకు మొక్కలు పెంచుటకు ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు. హరితహారం లో మొక్కల పెంపకానికి ప్రణాళిక సిద్ధం చేసి చేయాలని జిల్లాలు అడవులు అంతరించి అడవులలో ఉండవలసిన జంతువులు ప్రజల మధ్య కి వచ్చి అనేక సమస్యలకు గురి అవుతున్నాయని అన్నారు. వాటిని రక్షించే వలసిన బాధ్యత మన అందరిపై ఉందని హరితహారం గురించి జంతువుల ఆహారాన్ని ఇచ్చుటకు మొక్కల పెంపకానికి ఫారెస్ట్ ల్యాండ్ అయినా ప్రభుత్వం గుర్తించి ఆవులకు, గేదెలకు అదేవిధంగా కోతులకు ఆహారంగా పండ్ల మొక్కలు  పెంచాలని కలెక్టర్ అన్నారు.

 ఈ సందర్భంగా పల్లె ప్రగతి అభివృద్ధి పనుల్లో భాగంగా వైకుంఠ దామాలు, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. గ్రామీణ ప్రాంతంలో రూపొందించుకున్న ప్రణాళిక కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు. గ్రామ ప్రజలను బాగా చేసుకుని గ్రామాలను గొప్పగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రతి మండలం పరిధిలో అధికారి లక్ష్య సాధన దిశగా కృషి చేయాలని సూచించారు. ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో మియావాకి విధానం ద్వారా అవసరమైన చర్యలు తీసుకోవాలని,  పల్లె ప్రకృతి వనాల పనులలో వేగం పెంచాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వ స్థలాలు సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామాలలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి వాటిని సంరక్షిచాలని సూచించారు.

 ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ఏటూరునాగారం పి ఓ హనుమంతు కె జండగే, ఆదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి, డిఎఫ్ ప్రదీప్ శెట్టి, ఎఫ్ డి ఓ నిఖిత, డిఆర్ వో రమాదేవి, డి ఆర్డి ఓ పి డి పారిజాతం, మరియు జిల్లాలోని ఎంపీడీవోలు, తహసీల్దార్లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: