CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వితంతు,ఒంటరి మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలి : అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏ.ఎస్పీ ) సాయి చైతన్య.

Share it:


మన్యం టీవీ ఏటూరునాగారం:


వితంతు,ఒంటరి మహిళలు  సమాజంలో అనాలోచిత ధోరణికి గురైతే నిర్భయంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని,వితంతు ఒంటరి మహిళల కు బాసటగా నిలబడి  చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ములుగు 

ఏ ఎస్పీ సాయి చైతన్య అన్నారు.

 వితంతు ఒంటరి మహిళా సమస్యల సాధన సంక్షేమ సంఘం నిర్వహకుడు సంద బాబు ఆధ్వర్యంలో భూమిక ఉమెన్స్ కలెక్టివ్ హైదరాబాద్  వారు రూపొందించిన హింస లేని సమాజం స్త్రీల హక్కు అనే కరపత్రాన్ని ఏ ఎస్ పి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్త్రీల పై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా నవంబర్ 25  నుండి మొదలుకొని డిసెంబర్ 10 వరకు  16 రోజులను యాక్టివిజమ్ రోజులు గా పిలుస్తారని, వితంతు ఒంటరి మహిళల పై జరుగుతున్న మానసిక హింసలను ఆపడానికి, ప్రజలు  చైతన్యవంతులై  ఒంటరి మహిళలకు ఉన్న హక్కులను కాపాడాలని, ఒకవేళ  ఉన్న హక్కులను కాలరాస్తే  కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సమాజంలో వితంతు, ఒంటరి మహిళలు ఆత్మగౌరవంతో , స్వశక్తితో తమ ఆర్థిక  అవసరాలను తీర్చుకోగలిగే నిరంతర జీవనాధార అవకాశాలు తామే స్వయంగా నిర్మించుకోగలిగి ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆయన సూచించారు. వితంతు ఒంటరి మహిళల అభ్యున్నతి కోసం పాటు పడుతున్న సంద బాబు అభినందనీయుడని అన్నారు. ఒంటరి మహిళల పై జరుగుతున్న అన్ని రకాల హింసని వ్యతిరేకిస్తూ జరిగే 16 రోజుల ప్రచార ఉద్యమంలో అన్ని అంశాలను ప్రస్తావిస్తూ హింసలేని సమాజం స్త్రీల హక్కుగా ప్రాచుర్యంలోకి రావాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో వితంతు, ఒంటరి మహిళలు ఎక్కడైన, ఎప్పుడైన అఘాయిత్యాలకు, అరాచకాలకు మానసిక హింసలకు గురైతే వెంటనే,, డయల్ 100, లేదా  భూమిక టోల్ ఫ్రీ నంబర్ 1800 425 2908 ను వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ సామాజిక రచయితల సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు కోండ్లే శ్రీనివాస్, జర్నలిస్ట్ చల్ల గురుగుల రాజు లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు చుంచు రమేష్ లు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: