CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అభివృద్ధి పనులను పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య

Share it:



మన్యం టీవీ ఏటూరునాగారం:


జిల్లాలోని అటవీ భూముల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కలెక్టర్ జిల్లాస్థాయి అటవీ హక్కుల కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైకుంఠ దామాలు, డంపింగ్ యార్డ్ నిర్మాణానికి ఒక హెక్టారు కంటే తక్కువ విస్తీర్ణంలో భూమి కావలసి ఉన్నందున ఎస్డిఎల్ సి లో ఆమోదం తీసుకుంటే సరిపోతుందని అన్నారు. ఎఫ్ ఆర్ఏ యాక్టర్ 16 లో కమ్యూనిటీ హక్కులు ఇస్తే ప్రభుత్వ పథకాల లబ్ధి పొందుతారు .పనులు ఎక్కడ ఆప వద్దని ఆయన అన్నారు. వచ్చే సమావేశంలో 9 ప్రతిపాదనలను సమర్పించాలన్నారు. సిఏ ల్యాండ్ ఎంత కావాలో ప్రతిపాదనలు సమర్పిస్తే వారం రోజులలో చర్యలు తీసుకుంటామన్నారు. 22 ప్రతిపాదనలకు 3(2) ఆమోదించినట్లు ఆయన తెలిపారు. అనంతరం కలెక్టర్ అటవీ రక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జాకారం అటవీ భూమి కో-ఆర్డినెట్స్ సమర్పించాలన్నారు. గత సమావేశాల్లో ఎజెండా అంశాలపై తీసుకున్న చర్యలు సమర్పించాలన్నారు. బ్లాకుల వారీగా పోలీస్ స్టేషన్ల వారీగా ఎంత అటవీ భూమి ఆక్రమణకు గురైంది, ఎంత మంది ఆక్రమణదారులు ఎంత మంది పై కేసు నమోదు చేసింది. వివరాలు సమర్పించాలన్నారు. బొగత జలపాతం, లక్నవరం,తాడ్వాయి హట్స్ తదితర చోట్ల కట్టడాలు, వాటి నుండి ఎంత మేర ఏ ఏ ఏ ఉత్తర్వుల ప్రకారం రుసుములు వసూలు చేస్తోంది. వసూలు చేసిన మొత్తం ఖర్చు చేసి నివేదిక సమర్పించాలని ఆయన అన్నారు. వాహనాలు సీజ్ వివరాలు తెలియజేయాలన్నారు. నర్సరీలు ఏర్పాటు, ఎర్రమట్టి తదితరలకు ఖర్చు వివరాలు సమర్పించాలన్నారు. వైల్డ్ లైఫ్ సెంచురీలో వన్యప్రాణులకు ఫీడింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలన్నారు. అటవీ సంపదను స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని చెక్ పోస్టులను  పటిష్టం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటేల్, ఐటిడిఏ పిఓ హనుమంతు కె జండగే, ఆదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా రెవెన్యూ అధికారి కె. రమాదేవి, ఎఫ్ డి వో లు  నిఖిత, గోపాల్ రావు, రోడ్డు భవనాల శాఖ ఇఇ వెంకటేష్, గిరిజన సంక్షేమ శాఖ ఇఇ నిరంజన్ రావు,జెడ్పిటిసి పి. రమణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: