CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పనస పండు(jack fruit)ఆరోగ్య ప్రదాయిని

Share it:


మన్యం టీవి:

సేకరణ:కొత్త దామోదర్ గౌడ్, 

  ఆర్ఎం,భద్రద్రి, ములుగు

పనసలోని అనేకమైన లాభాల కారణంగా భారత ప్రాచీన కాలం నుండి పనసను ఒక కల్పతరువుగా భావిస్తారు. ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా పనస ప్రాచుర్యం బాగా పెరిగిందనే చెప్పాలి. దీని రుచి అపారమైనది, దీని ఉపయోగాలు అసంఖ్యాకమైనవి. అటువంటి పండుకు కూడా ఇతర ఫలాల తరహాలోనే ఎన్నో సద్గుణాలతో పాటు కొన్ని దుర్గుణాలు కూడా ఉన్నాయని అంటున్నారు కొంతమంది నిపుణులు. మరి ప్రపంచంలోనే అతిపెద్ద తీపి పండుగా చెప్పుకునే ఈ పనసలో ఉన్న ఆ ఉపయోగాలు, నిరుపయోగాలు ఏమిటో చూద్దాం.

పనస ఉపయోగాలు:

1. పనసలో ఉండే ఖనిజాలు, పోషకాల కారణంగా దీనిని రోగనిరోధక శక్తిని పెంపొందించే అద్భుత సాధనంగా పరిగణిస్తారు.

2. ఎక్కువగా ఉష్ణమండలంలో పెరిగే పనసలో అధికమైన కేలరీల శక్తి ఉంటుంది, తద్వారా ఆకలిని ఎక్కువ సేపు నిలుపుకునే ప్రాంతవాసులకు పనస ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

3. ఒక కప్పు పనస తీసుకుంటే 155 కేలరీల శక్తి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే ప్రోటీన్లు అధిక శాతంలో ఉండి మనకు కావలసిన ఉత్తేజాన్ని కలిగిస్తాయి.

4. కొన్ని ఆహారపదార్ధాలు శక్తిని సమకూర్చే క్రమంలో శరీరంలోని కొవ్వు శాతాన్ని అమాంతం పెంచేస్తాయి. కాని పనస అలా కాదు, శరీరంలో కావలసిన శక్తిని సమకూరుస్తూనే కొవ్వు శాతాన్ని పెరగకుండా చేస్తుంది.

5. పనస క్యాన్సర్ మరియు మూలశంక రోగాల నివారణతో పాటు హృదయ సంబంధిత వ్యాధులకు కూడా అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

6. ఇందులో ఉండే ప్రోటీన్లు ఎముకల దృఢత్వానికి బాగా ఉపయుక్తం. అంతేకాకుండా పనసలోని గుణాలు ఆస్తమాను దరిచేరనీయకపోవడమే కాకుండా కంటి సమస్యలను అరికడుతుంది.

7. విటమిన్ సికి భాండాగారమైన పనస ఊపిరితిత్తుల సమస్యలను అధిగమించేలా చేస్తుంది.

8. పనస చెట్టు మొద్దులను ఇంటిలో ఉపయోగించే చెక్క సామాన్లు చేయడానికి మరియు సంగీత పరికరాలను రూపొందించాడనికి కూడా వినియోగిస్తారు.

నష్టాలు:

1. పనసలో రక్తాన్ని గడ్డకట్టించే లక్షణాలు అధికంగా ఉంటాయి. అందుకే దీనిని శస్త్రచికిత్స చేయించుకునే వారిని, ఇతర రక్త సంబంధిత రోగాలు ఉన్నవారిని తినకూడదని చెబుతుంటారు.

2. మధుమేహ వ్యాధిగ్రస్తులలో గ్లూకోస్ స్థాయిని పెంచే గుణం పనసకు ఉంటుంది, కనుక మధుమేహం ఉన్నవారు ఈ పండును మితంగా తింటే మంచిది.

3. గర్భవతులు పనసను తీసుకోవడం మూలంగా గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉందని కొంతమంది ఆరోగ్య నిపుణులు అంటున్నారు, అయితే వీటికి ఎటువంటి నిరూపణలు జరగలేదు.

4. ఎక్కువగా అలవాటు లేని వారు ఉన్నట్లుండి పనసను తీసుకుంటే వారికి అలర్జీ సోకే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంటున్నారు.

5. ఇందులో ఉండే ఫైబర్ పోషకాలు అరుగుదలపై ప్రభావం చూపి గ్యాస్ ఏర్పడేలా చేయడమే కాకుండా ఇతర ఉదర సమస్యలకు కారణమవుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.

Share it:

ARTICLES

Post A Comment: