CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అభివృద్ధికి మద్దతిచ్చి..టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Share it:



గాంధీనగర్ డివిజన్ లో ఎమ్మెల్సీ కవిత పాదయాత్ర


ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండే పార్టీ టీఆర్ఎస్: ఎమ్మెల్సీ కవిత


బండ్ల గణేష్ ను మించిన ఎంపీ బండి‌ సంజయ్ కామెడీ: ఎమ్మెల్సీ కవిత


గ్రేటర్ లో టీఆర్ఎస్ సెంచరీ ‌కొట్టడం ఖాయమన్న ఎమ్మెల్సీ కవిత


గత ఆరేండ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ రూపురేఖలు మార్చేసిందని, డిసెంబర్ 1 న జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటెయ్యాలన్నారు ఎమ్మెల్సీ  కల్వకుంట్ల కవిత. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధీనగర్ డివిజన్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాదయాత్ర చేశారు‌. డివిజన్‌లోని పలు బస్తీలు, కాలనీల్లో పాదయాత్ర చేస్తూ, ప్రజలను  కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ వంద స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ గారిని ఎదుర్కొనడానికి, కేంద్రం నుండి పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు వస్తున్నారంటే, టీఆర్ఎస్ బలమేంటో అర్థం చేసుకోవాలన్నారు ఎమ్మెల్సీ కవిత. పదకొండేళ్ల కింద, 2009 నవంబర్ 29 న ప్రాణాలను ఫణంగా పెట్టి సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష ప్రారంభించారని, అదే దిక్షా దివస్ స్పూర్తితో తెలంగాణ ప్రగతికి పునరంకితమవుదామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.


500 మందికి పైగా కార్యకర్తలు, స్థానిక నాయకులు, ప్రజలతో కలిసి ఆదివారం ఉదయం ఎమ్మెల్సీ కవిత పాదయాత్ర ప్రారంభించారు. ప్రతి బస్తీలో ఎమ్మెల్సీ కవితకు స్థానిక మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లు, పూల మాలలతో ఎమ్మెల్సీ కవిత గారిని, స్థానికులు తమ కాలనీల్లోకి ఆహ్వానించారు. గాంధీనగర్ లోని ప్రతి గల్లీకి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత, అందరినీ ఆప్యాయంగా పలకరించారు. తమ బస్తీలో రోడ్ల సమస్య ఉందని నేతాజీ నగర్ వాసులు ప్రస్తావించగా, రోడ్డు సౌకర్యం కల్పించే బాధ్యత నాదంటూ ఎమ్మెల్సీ కవిత భరోసానిచ్చారు. గాంధీనగర్ డివిజన్ లో గత ఆరేండ్లుగా బస్తీ దవఖానాలు, కమ్యునిటీ హాళ్లు నిర్మించిన విషయాన్ని స్థానికులు ఎమ్మెల్సీ కవితతో పంచుకున్నారు. అంతేకాదు అనేక మంది యవతీ యువకులు, ఎమ్మెల్సీ కవితతో ఉత్సాహంగా సెల్ఫీలు దిగారు. అంతేకాదు కార్యకర్తలతో కలసి స్టెప్పులు వేసిన ఎమ్మెల్సీ కవిత, పాదయాత్రలో జోష్ ను తీసుకొచ్చారు.


వరదలు వచ్చినప్పుడు రాకుండా, కేవలం ఓట్ల కోసమే వస్తున్న బీజేపీ నాయకులను ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.  గత ఎన్నికల్లో బండ్ల గణేష్ కామెడీనీ మించి, ప్రస్తుతం ఎంపీ బండి సంజయ్ కామెడీ చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైదరాబాద్‌కు వరదలు వస్తే ఏ ఒక్క పార్టీ కానీ, నాయకుడు కానీ పట్టించుకోలేదు కానీ మన టీర్ఎస్ ప్రభుత్వం నష్టపోయిన కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సాయం అందిస్తోందని తెలిపారు. ఈ ఎన్నికల తర్వాత మిగిలిన వారికి కూడా పదివేల ఆర్థికసాయం అందిస్తామని ప్రకటించిన  ఎమ్మెల్సీ కవిత, కరోనా సమయంలో కూడా పనిచేసిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని కొనియాడారు. టీఆర్ఎస్‌కు ఓటు వేసి హైదరాబాద్‌ను కాపాడుకోవాలని, అమూల్యమైన ఓటుతో అభ్యర్థులందరిని గెలిపించుకోవాలని సూచించారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లొ టీఆర్ఎస్ గెలుపు, గాంధీ నగర్ డివిజన్ నుండే ప్రారంభమవుతుందన్నారు ఎమ్మెల్సీ కవిత. ముషీరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, గాంధీనగర్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా పద్మ నరేష్, నాయకులు జైసింహ, శ్రీధర్ రెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: